టాలీవుడ్ లో హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉన్నది.  ఈ డిమాండ్ ను అనుసరించి రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు.  అయితే, నయనతార విషయంలో ఇది వేరుగా ఉంటుంది.  ఆమె ఇప్పుడు సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ హీరోయిన్.  ఈ హీరోయిన్ వరసగా టాప్ సినిమాలు చేస్తోంది.  అంతేకాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలోతో ఎప్పుడు బిజీగా ఉంటోంది.  సౌత్ లో ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో ఆమెకు మంచి మార్కెట్ ఉన్నది.  


అందుకే ఆమెకోసం  ప్రత్యేకంగా దర్శక నిర్మాతలు సినిమాలు చేస్తుంటారు.  మంచి వసూళ్లు వస్తున్నాయి కాబట్టి దానిని ఎవరూ కాదనరు.  అయితే, ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ ను భరించాలి అంటే మాములు విషయం కాదు. సినిమాకు అవసరమయ్యే బడ్జెట్ తో పాటుగా అదనంగా మరికొంత బడ్జెట్ ను కూడా కేటాయించాల్సి వస్తుంది.  నయనతార దగ్గర ఆమెకు అసిస్టెంట్ గా సెట్స్ లో ఆరేడుగురు పనిచేస్తుంటారు.  

 

వారికి జీతాలను నిర్మాతలే భరించాలి.  రోజుకు ఒక్కొక్కరికి 7 నుంచి 12 వేల రూపాయల వరకు ఉంటుంది.  అంతేకాదు, ఆరోజు వారి ఖర్చులు కూడా నిర్మాతే చూసుకోవాలి.  ఇక క్యారీవ్యాన్ ఖర్చులు కూడా నిర్మాతవే.  నయనతార తో ఒక సినిమా తీస్తే కనీసం అదనంగా కోటి ఖర్చు అవుతుందని నిర్మాతలు వాపోతున్నారు.  కానీ, నయనతారకు ఉన్న మార్కెట్ దృష్ట్యా దానిని పెద్దగా పట్టించుకోవడం లేదు.  


ఇకపోతే, నయనతార కొన్ని విషయాల్లో పక్కాగా ఉంటుంది.  సినిమా మాత్రమే చేస్తుంది.  ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనదు.  ఈ విషయం అందరికి తెలుసు.  కానీ తప్పదు ఒప్పుకుంటారు.  మార్కెట్ లో డిమాండ్ ఉన్నప్పుడే ఆ వస్తువుకు ధర పలుకుతుంది.  నయనతార విషయంలో కూడా అంతే.  అందుకే ఆమెకు అంతటి డిమాండ్ అని అంటున్నారు నిర్మాతలు.  మరి ఈ డిమాండ్ ఎప్పుడు తగ్గుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: