కాలం మారుతుంది కానీ మనుషుల్లో మానవత్వం మాత్రం ఎప్పటికీ మారదు అనే విషయాన్ని లయాత్మకంగా చెప్పిన సినిమా శంకరాభరణం. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో జేవీ సోమయాజులు, చంద్ర మోహన్, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా శంకరాభరణం. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గిపోతున్న సమయంలో విడుదలైన ఈ సినిమా ప్రజలు శాస్త్రీయ సంగీతం పట్ల ఆకర్షితులయ్యేలా చేసింది.                       
 
శంకరాభరణం సినిమా విడుదలైన తరువాత ఈ సినిమా చూసి చాలా మంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే ఈ సినిమా ప్రభావం ప్రజలపై ఎంత ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ పూర్తిగా తగ్గిన సమయంలో ఈ సినిమా చూసి ఎంతోమంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. అది ఈ సినిమా సాధించిన గొప్ప విజయం. 
 
సినిమా విడుదల తరువాత ఎంతోమంది వీణలను కొని సంగీతం నేర్చుకున్నారు. ఈ సినిమా విడుదల తరువాత వీణలకు కూడా భారీగా డిమాండ్ పెరగడం గమనార్హం. ఈ సినిమా విడుదలై నేటికి 40 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు జంధ్యాల మాటలు అందించగా v MAHADEVAN' target='_blank' title='కె వి మహదేవన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కె వి మహదేవన్ సంగీతం అందించారు. ఒక గొప్ప కళాఖండంగా పేరు తెచ్చుకున్న శంకరాభరణం తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయిందనడంలో సందేహమే లేదు. 
 
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాకు తొలి జాతీయ అవార్డును అందుకున్నాడు. స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రంగా శంకరాభరణం రికార్డులు సృష్టించింది. కలకాలం నిలిచిపోయే సినిమాల్లో శంకరాభరణం ఒకటి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దక్షిణాది రాష్ట్రాలలో విడుదలై విజయం సాధించిన శంకరాభరణం పలు దేశాలలో విడుదలై తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: