ప్రభాస్ జిల్ రాథాకృష్ణల మూవీకి ‘జాన్’ అన్న పేరు పెట్టాలని ఈ మూవీ యూనిట్ వర్గాలు ఆలోచన చేస్తూ వచ్చాయి. ‘జాన్’ అనే పదం ఉర్దూ భాష నుండి వచ్చింది. ఆ భాషలో ఈ పదానికి ‘జీవితం’ అనే అర్ధం వస్తుంది. ప్రేమ అనే అర్ధం కూడ ఈ పదంలో ఉంది. 

మూవీ కథ రీత్యా అన్ని విధాల ఈ టైటిల్ సరిపోతుంది అని ప్రభాస్ ఆలోచనలు చేస్తుండగానే ఈ టైటిల్ కు కొద్దిగా మార్పులు చేసి సమంత శర్వానంద్ లు కలిసి నటిస్తున్న ‘96’ మూవీ రీమేక్ కు ‘జాను’ అన్న టైటిల్ పెట్టే విషయంలో దిల్ రాజ్ ప్రభాస్ తో చేసిన రాయబారాలతో తన మూవీ టైటిల్ ను వదులుకోవలసి వచ్చింది అని అంటారు. దీనితో ప్రభాస్ తన లేటెస్ట్ మూవీకి సరైన టైటిల్ ఎంచుకోవడం ఇప్పుడు ఒక సమస్యగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలో కూడ విడుదల చేస్తున్న పరిస్థితులలో అందరు సులువుగా కనెక్ట్ అయిపోయే టైటిల్ గురించి ఇప్పుడు ప్రభాస్ ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నారు. దీనితో తాము ముందు నుంచి ప్రచారంలోకి తీసుకు వచ్చిన ‘జాన్’ టైటిల్ ను సమంత సినిమా కోసం వదులుకుని తప్పు చేసానా అన్న ఫీలింగ్ ప్రభాస్ కు వస్తున్నట్లు టాక్. 

1980 కాలంనాటి ప్రేమ కథకు యూరప్ నేపధ్యం ఇచ్చి ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీ కథలో ‘సాహో’ ఫలితం తరువాత చాల మార్పులు చేర్పులు జరిగాయి. వాస్తవానికి ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేద్దామని భావించినా ‘సాహో’ షాక్ తో తన అభిమానులను నిరాశ పరచకుండా ఇదే సంవత్సరం ప్రభాస్ తన మూవీని అన్నీ కుదిరితే దసరా సీజన్ కు తీసుకు వచ్చి ‘సాహో’ ఇచ్చిన నిరాశ నుండి తన అభిమానులకు జోష్ ను ఇవ్వడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: