ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని సమస్య రోజు రోజుకీ పెరుగుతోంది. అమరావతిని రాజధానిగా తీసేసి మూడు రాజధానులు పెట్టాలని ప్రకటించినప్పటి నుండి అక్కడి ప్రాంత రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసి పాలన సాగించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు తమ ఆవేదనని వెళ్ళగక్కుతున్నారు. సుమారు ౨౯ గ్రామాల రైతులు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

 

 

 

అయితే ఈ ఆందోళనలు రోజు రోజుకీ కొత్తగా మారుతున్నాయి. తమ ఆందోళనని బయట ప్రపంచానికి తెలిసే విధంగా వినూత్నంగా ఆలోచిస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కోసం నాగం జనార్ధన రెడ్డి తన కుమారుడి పెళ్ళి పత్రికపై జై తెలంగాణ అనే నినాదాన్ని ప్రింట్ చేయించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోరుకుంటున్నామో తెలియజేసాడు. ఇప్పుడు ఆంధ్రలో కూడా అదే తరహాలో పెళ్ళీ పత్రికలపై అమరావతిని కాపాడండి అని నినాదాలని ప్రింట్ చేస్తున్నారు.

 

 

 

కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన జాస్తి సురేష్ వివాహం సందర్భంగా పెళ్లి పత్రికల్లో అమరావతి అంశాన్ని ప్రకటించారు. సురేష్ నిశ్చితార్థం సమయంలో వచ్చిన నంధువులందరూ అమరావతి ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తినకుండానే వెళ్ళిపోయారు. అప్పుడు తన వంతుగా ఏదైనా చేయాలని ఆలోచించిన సురేష్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అమరావతి విషయమై తనకు తోచిన రీతిలో ప్రచారం చేయాలని భావించాడు. 

 

 

 

తన పెళ్లి పత్రికపై సేవ్ అమరావతి, సేవ్ ఫార్మర్స్ అని ప్రచారం చేస్తూ పత్రికలని తన బంధువులతో పాటు, తనకి తెలిసిన వారందరికీ పంచుతున్నాడు. అమరావతి గురించి ఇలా వినూత్నంగా ఆలోచిస్తున్న సురేష్ నిర్ణయాన్ని చాలా మంది అభినందిస్తున్నారు.   సురేష్ చేస్తున్న వినూత్న ప్రచారాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: