ప‌వ‌న్‌ను దేవుడు అని టాలీవుడ్‌లో బాహాటంగా చెప్పే హీరో ఎవ‌రు అంటే అందులో మొద‌టి వ‌రుస‌లో హీరో నితిన్ ఉంటాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే నితిన్‌కు పిచ్ఛ అభిమానం. అలాగే అంతుకు మించిన ప్రేమను నితిన్ చూపిస్తాడు. నితిన్ స్టార్ట్ చేసిన సెకండ్ ఇన్నింగ్స్ స‌క్సెస్ ఫుల్‌గా కొన‌సాగుతుందంటే అందులో కొంత వ‌ర‌కూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశీస్సులు నితిన్‌కు ఉండ‌ట‌మే కారణం అని అంటారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోవ‌చ్చనే టాక్స్ వినిపిస్తున్నాయి. నితిన్ న‌టించిన ఇష్క్‌, గుండెజారి గ‌ల్లెంత‌య్యిందే మూవీల‌కు ప‌వ‌న్ ఆశీస్సులు నితిన్‌కు ల‌భించాయి. అయితే హార్ట్ఎటాక్ మూవీకు మాత్రం ప‌వ‌న్ ఆశీస్సులు నితిన్‌కు ల‌భించ‌లేదు. అందుకే ఈ మూవీ రిజ‌ల్ట్‌పై నితిన్ కొంత గంద‌ర‌గోళంగా ఉన్నాడంటూ టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ పూరీజ‌గ‌న్నాధ్‌కి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి అంత‌గా క‌మ్యునికేష‌న్ స‌రిగా లేక‌పోవ‌డంతో ఈ విష‌యాలు హార్ట్‌మూవీకు మైన‌స్‌గా మార‌వ‌చ్చని కొంద‌రు లెక్కలు వేస్తున్నారు. ఎందుకంటే ప‌వ‌న్ అభిమానులు హార్ట్ఎటాక్ మూవీ ప్రమోష‌న్స్‌లో పార్టిసిపెట్ చేయ‌డంలేదంట‌. సోషియ‌ల్ నెట‌వ‌ర్కింగ్ సైట్స్‌లోను ప‌వ‌న్ అభిమానులు హార్ట్ఎటాక్ మూవీను అంత‌గా ప‌ట్టించుకోవ‌డంలేదు. ఇదంత క‌లిసి హార్ట్‌మూవీ రిజ‌ల్ట్‌ను రివ‌ర్స్ చేస్తాయోమో అని నితిన్ బెంగ పెట్టుకుంటున్నాడు. అయితే హార్ట్ఎటాక్ మూవీ రిలీజ్ లోపు నితిన్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఓ సారి క‌లిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇలాగైన పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవ‌చ్చనే ఆలోచ‌న‌లో నితిన్ ఉన్నాడ‌ని టాలీవుడ్ చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: