2012 లో నిర్భయ ఉదంతం అందరికీ తెలిసిందే. దేశ రాజధానిలో జరిగిన ఆ చర్యకి యావత్ భారతదేశం ఉలిక్కి పడింది. అర్థరాత్రి ఆడపిల్లకి రక్షణ ఇవ్వలేని సమాజమా మనది అని అందరూ ఆశ్చర్యపోయారు. నలుగురు మృగాలు ఒక అమ్మాయిని కిరాతకంగా మానభంగం చేసి చంపేశారు. అందుకుగాను ఆ నలుగురికి ఉరిశిక్ష విధించింది కోర్టు. ఉరిశిక్ష విధించింది కాని అమలు మాత్రం కావట్లేదు.

 

 

 

 

పేరుకే ఉరి శిక్ష పడిన మాటే గానీ ఇప్పటి వరకు అమలు కాకపోవడం ఏంటో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ రేపని, మాపనీ రోజులు, సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఫిబ్రవరి ఒకటవ తేదీన వారి నలుగురికీ ఉరి శిక్షని అమలు చేయాలని కోర్ట్ తీర్పు ఇచ్చింది. కానీ ఆ నలుగురిలో వినయ్ కుమార్ అనే నిందితుడు క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి వద్దకి వెళ్ళాడు.

 

 

 

 

ఆ క్షమాభిక్ష మీద రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. క్షమాభిక్ష అడిగింది వినయ్ కుమార్ కదా మిగిలిన ముగ్గురికైనా ఉరి అమలు చేయాలని అంటే లాయర్లు అలా వీలు కాదని ,రూల్స్ ఒప్పుకోవని అంటున్నారు. దాంతో ఉరి అమలు ఆగిపోయింది. మన చట్టాల్లో ఉన్న లొసుగులే నిందితులని కాపాడుతున్నాయని అంటున్నారు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వారిని జైళ్ళలో కూర్చోపెట్టి మేపుతున్నామని, చట్టాల్లో ఉన్న లొసుగుల వల్ల ఎంత పెద్ద నేరం చేసినా నేరగాళ్ళకి త్వరితగతిన శిక్ష పడటం లేదని వాపోతున్నారు. 

 

 

 

ఇలా అయితే నేరగాళ్ళకి భయం ఎక్కడ ఉంటుందనే పాయింట్ కూడా వినిపిస్తుంది. నిర్భయకి జరిగిన అన్యాయం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్తున్నారు. చట్టాలు మార్చకుంటే మన పరిస్థిని చూసి ఇతర దేశాలు నవ్వుకునే పరిస్థి రావచ్చేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: