యంగ్ హీరో నాగశౌర్య లేటెస్ట్ మూవీ ‘అశ్వథ్థామ’ ను ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగశౌర్య ఎవరికీ తెలియని తన అభిరుచులను లీక్ చేసాడు. తనకు కుక్కలు అంటే విపరీతమైన ఇష్టం అని చెపుతూ ఇప్పటి వరకు తాను 23 కుక్కలను పెంచిన విషయాన్ని లీక్ చేసాడు. ప్రస్థుతం తన వద్ద ఇటలీ నుంచి తెప్పించిన ‘బూ’ గురించి చెపుతూ కేన్ కోర్సో జాతికి చెందిన ఈ కుక్క పులిని కూడ బెదిరిస్తుందని తాను డాగ్ ట్రైనర్ సహాయంతో సాత్విక జంతువుగా మార్చివేసి ఇప్పుడు ఆ కుక్కకు గొలుసు కూడ కట్టకుండా తనతో పాటు షూటింగ్ కు తీసుకు వెళ్ళడమే కాకుండా ప్రతిరోజు తన పక్కన పడుకో పెట్టుకుంటున్న విషయాలను విఅరించాడు.

ఇదే సందర్భంలో నాగశౌర్య కార్ల పై తనకు ఉన్న మోజును గురించి వివరిస్తూ ప్రస్తుతం తన ఇంటిలో 13 కార్లు ఉన్నాయని బెంజ్ ఆడి లాంటి అనేక ఖరీదైన కార్లు తన దగ్గర ఉన్నాయి అన్న విషయాన్ని వివరిస్తూ తనకు ఉన్న కార్ల పిచ్చిని గమనించి తన తల్లి తండ్రులు ఖంగారు పడుతున్న విషయాన్ని నవ్వుతూ బయట పెట్టాడు. ఇండస్ట్రీలో హీరోలు ఆస్థులను పెంచుకుంటుంటే తాను మాత్రం కార్లను కుక్కలను పెంచుకుంటున్నాను అంటూ తన పై తానే సెటైర్ వేసుకున్నాడు. 

ఇదే సందర్భంలో నిహారిక తో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. నిహారికా రష్మిక రాశి ఖన్నా మాళవిక తనకు మంచి స్నేహితులు అని చెపుతూ అయితే తాము కలిసినప్పుడల్లా తమ మధ్య సినిమాలతో సంబంధం లేని విషయాలను మాట్లాడుకుంటాము అని చెపుతూ ఒక షాకింగ్ నిజాన్ని బయట పెట్టాడు. స్లిమ్ గా కనిపించే నాగశౌర్య కు బిర్యాని అన్నా టమోటా దాల్ అన్నా తనకు చాల ఇష్టం అని చెపుతూ బయట పడని తన అలవాట్లను బయట పెట్టాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: