నందమూరి బాలకృష్ణ ప్రముఖ దర్శకులు క్రిష్ తెరకెక్కించిన గౌతమి పుత్ర శాతకర్ణి తో వంద సినిమాలు పూర్తి చేసుకున్నారు.  ఆ మూవీ తర్వాత తెరకెక్కించిన సినిమాలు వరుసగా ఫ్లాపులు అవుతున్నాయి.  ఇటీవల వచ్చిన రూలర్ మూవీ కూడా ఫ్లాప్ కావడంతో బాలయ్య తనకు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి శ్రీనివాస్ నే నమ్ముకున్నారు.  ఇప్పటికే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బాలయ్య సరసన హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా తర్జన భర్జన జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  కొత్త హీరోయిన్స్ ...తమ వయస్సు కన్నా చాలా చిన్న వాళ్లు అవుతారు. పోనీ ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ని తెచ్చుకుందామంటే వాళ్లు ఫేడవుట్ అయిపోయి ఉంటారు. ఏం చేయాలో అర్దం కాని పరిస్దితిలో సీనియర్స్ ,వాళ్లను డైరక్ట్ చేసే దర్శకులు కొట్టిమిట్టాడుతున్నారు.

 

అయితే ఇప్పుడు బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూవీ పై అందరి దృష్టి పడింది.  ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదట కేధరిన్ ని అనుకున్నా...ఆమె నో చెప్పేసింది. నయనతార తను తెలుగులో సినిమాలు చేసేందుకు డేట్స్ ఖాళీ లేవంది. మిగతా హీరోయిన్స్ తో వర్కవుట్ కావటం లేదు. ఈ క్రమంలో బోయపాటి దృష్టి అంజలిపై పడిందని సమాచారం. అయితే తమిళంలో తాను బిజీగా ఉన్నానని చెప్పిందిట. దాంతో స్వయంగా బాలయ్యే ఆమెకు ఫోన్ చేసారని చెప్పుకుంటున్నారు.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘డిక్టేటర్’ వచ్చిన విషయం తెలిసిందే. 

 

 

 ఇక ఈ సినిమాలో బాలయ్య విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నాడు. అఘోరా పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమాలోనూ బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. మరి ఈ సినిమాలో బాలయ్యతో నటించే హీరోయిన్లు సైతం పవర్ ఫుల్ పాత్రలో ఉండబోతున్నట్లు కనిపిస్తుంది.  ఎన్నికల బిజీ తర్వాత బాలయ్య మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.. గతంలో హిట్ సినిమాల్లాగే ఈ మూవీ కూడా మంచి హిట్ అందుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.  మరి బాలయ్య ఫోన్ మంత్రం ఎంత వరకు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: