ఈ సారి సమ్మర్ సందడి, సంక్రాంతికి మించిన స్థాయిలో వుండబోతోంది.. నిజమే. మామూలుగా సినిమాలకు సీజన్ అయిన సంక్రాంతి సమయంలో భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోరాడుతూ ఉంటాయి. అయితే ఈ సారి.. సంక్రాంతి సమయంలో రెండు పెద్ద సినిమాల ధాటికి మిగతా సినిమాల విడుదలలు వాయిదాల బాట పట్టాయి. సమ్మర్ సందర్భంగా మాత్రం సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా ఒకదానికి మరోటి పోటీగా వచ్చేస్తూ ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. ఈ సమ్మర్ లో విడుదల షెడ్యూల్ అయిన సినిమాల వ్యాపారం అత్యంత భారీ స్థాయిలో ఉండటం.

 

అయితే.. సమ్మర్ సీజన్లో స్కూళ్ళు, కాలేజీలకు సెలవలు ఉండటం వలన మ్యాగ్జిమం ఆడియన్స్ ఆ టైంలో సినిమాలు చూడటానికే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఈ సీజన్ లో రెండు నెలల పాటు దండిగా సినిమాలుంటాయి. ఏప్రిల్ మే రెండు నెలల్లో ఇప్పటి నుండే థియేటర్స్ బ్లాక్ చేసుకుంటున్నారు నిర్మాతలు. అయితే ఈ ఏడాది సమ్మర్ ను స్టార్ హీరోలు లైట్ తీసుకోవడంతో కుర్ర హీరోలు రంగంలోకి దిగబోతున్నారు. ఏప్రిల్ లో నాగ చైతన్య చేస్తున్న 'లవ్ స్టోరి' రామ్ రీమేక్ సినిమా 'రెడ్' శర్వానంద్ ఎమోషనల్ డ్రామా 'శ్రీకారం' రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా 'ఉప్పెన' థియేటర్స్ లోకి వస్తున్నాయి. 

 

ఇక మేలో సాయి ధరం తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' రవి తేజ 'క్రాక్' ప్లానింగ్ లో ఉన్నాయి. ఇలా ఇప్పటికే అరడజను పైనే సినిమాలు సమ్మర్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు ఈ లిస్టులో యాడ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. మరి వీటిలో ఏ సినిమాలు సీజన్ ను పర్ఫెక్ట్ వాడుకొని నిర్మాతలకు కాసులు కురిపిస్తాయో చూడాలి.

 

త్వరలో రాబోయే సినిమాలు ఏంటో తెలుసుకుందాం. మార్చి 25న నాని;సుధీర్ బాబు కాంబినేష‌న్లో రాబోయే వి సినిమా తొలి వేస‌వి సినిమా. ఏప్రిల్ 2న నాగ‌చైత‌న్య‌-సాయిప‌ల్ల‌వి-శేఖ‌ర్ క‌మ్ముల ల‌వ్ స్టోరీ వ‌స్తుంది. అదే రోజు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా డెబ్యూ సినిమా ఉప్పెన. త‌ర్వాతి వారం రామ్ ’రెడ్‘ మూవీ రిలీజ‌వుతుంది. డేటు రాలేదు గానీ  ఏప్రిల్ లో కేజీఎఫ్ ఛాప్ట‌ర్-2 రిలీజవ్వొచ్చు. ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య 17న రిలీజ‌వుతుంది.  మేలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీ మూవీ. నాగార్జున సినిమా వైల్డ్ డాగ్.  అఖిల్ కొత్త సినిమా, గోపీచంద్ సీటీమార్, శ‌ర్వానంద్ శ్రీకారం, సాయిధ‌ర‌మ్ తేజ్ సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమాలు విడుదల అవుతాయి. వీటికి ఇంకా డేట్లు రాలేదు. కాకపోతే సమ్మర్ సినిమాలు అని ప్రకటించడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: