తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన కాలాత్మక దృశ్యకావ్యం శంకరాభరణం. ఈ సినిమా ఫిబ్రవరి 2, 1988లో విడుదలైన ప్రపంచం నలుమూలల్లో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించండి. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాలతో  తెలుగు చిత్రపరిశ్రమ విలువలు మొత్తం కొట్టుకు పోతున్న సమయంలో... మట్టిలో మాణిక్యం లాంటి సినిమా శంకరాభరణం. కొత్త నటీనటులతో ఈ సినిమా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. శంకరాభరణం సినిమా విడుదల తర్వాత ప్రతి చోటా శంకరాభరణం మాటే... అందరి నోట శంకరాభరణం పాటే . అలనాటి స్టార్ హీరోలు హీరోయిన్లు ఎవరు ఇందులో నటించకపోయినా శంకరాభరణం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 

 

 

 కాగా నేటీకి శంకరాభరణం సినిమా విడుదలై  40 సంవత్సరాలు పూర్తవుతుంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలు శంకరశాస్త్రి తులసి మధ్య ఉన్న అనుబంధం... తెలుగు ప్రజలనే కాదు ఇతర రాష్ట్రాల వారిని కూడా కట్టిపడేసింది. శాస్త్రీయ సంగీతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ శంకరాభరణం సినిమా... శాస్త్రీయ సంగీతానికి మరింత గౌరవాన్ని ఆదరణను పెంచింది. ఈ సినిమా విడుదల అనంతరం ఎంతోమంది శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపారు. ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఇది మా తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే విధంగా శంకరాభరణం సినిమా నిలిచింది. 

 

 

 ఈ సినిమా విడుదలై 40 సంవత్సరాలు పూర్తయినప్పటికీ... ఇప్పటికీ శంకరాభరణం ఆల్బమ్ బ్లాక్ బస్టర్ గానే ఉంది అనడంలో సందేహం లేదు. సినిమాలో  ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం బెస్ట్ సింగర్ గా తొలి జాతీయ అవార్డును అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కె.వి.మహదేవన్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు కథ కథాంశం ఎంత బలంగా నిలిచిందో  ఈ సినిమాకు కే.వి.మహదేవన్ అందించిన సంగీతం ప్రాణం పోసిందని అని చెప్పాలి. ఇప్పటికీ శంకరాభరణం సినిమా వస్తుందంటే టీవీల ముందు నుంచి కదలని వారు ఎంతోమంది. ఎంతోమంది ఈ ఆల్బమ్ లో ప్రత్యేకంగా తిలకిస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: