నిన్నటిరోజున జరిగిన ‘జాను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంత మాట్లాడిన మాటలకు ఆ ఈవెంట్ కు వచ్చిన వారు అంతా షాక్ అయ్యారు. ‘జాను’ మూవీ గురించి చెపుతూనే మరొక వైపు దిల్ రాజ్ శర్వానంద్ లపై ఆమె చేసిన కామెంట్స్ ఈ ఈవెంట్ కు హాట్ టాపిక్ గా మారాయి.

తమిళనాడులో విడుదలై దక్షిణాదిన సంచలనాలు సృష్టించిన ‘96’ రీమేక్ గా తీయబడ్డ ‘జాను’ లో మొదట్లో తాను నటించడానికి తాను ఇష్టపడలేదు అన్న విషయాన్ని సమంత బయటపెట్టింది. అయితే దిల్ రాజ్ తాను ఎక్కడ కనిపించినా ఈ మూవీలో నటించమని విపరీతంగా బలవంత పెట్టడంతో ఒక సందర్భంలో తాను దిల్ రాజ్ కనిపించినప్పుడల్లా పారిపోవడానికి ప్రయత్నించిన విషయాలను షేర్ చేసింది. 

ఇదే సందర్భంలో తన సక్సస్ సీక్రెట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ తాను నటించే ప్రతి సినిమాను తన మొదటి సినిమాగా భావిస్తానని అంతేకాకుండా ఆ మూవీ పాత్రలోని విషయాలను తాను నిరంతరం ఆలోచించడం వల్ల తనకు ఒకొక్కసారి టెన్షన్ కూడ ఏర్పడుతుంది అంటూ కామెంట్స్ చేసింది. ఈ టెన్షన్ ను పసికట్టిన నాగచైతన్య అనేకసార్లు మందలించిన విషయాన్ని కూడ నవ్వుతూ షేర్ చేసింది. 

ఈ మూవీలో తన రోల్ బాగా వచ్చింది అంటే శర్వానంద్ వల్లనే అని చెపుతూ శర్వా తనతో పోటీపడి నటించిన పరిస్థితులలో ఈ మూవీ కోసం తాను చాల కష్టపడవలసి వచ్చిన విషయాలను షేర్ చేసింది. వాస్తవానికి ఈ మూవీ పై క్రేజ్ బాగానే ఉన్నప్పటికీ గతంలో ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలు చాల ఉన్న పరిస్థితులలో ప్రస్తుతం వెరైటీ సినిమాలను కోరుకుంటున్న యూత్ ఈ సినిమాకు ఎంత వరకు కనెక్ట్ అవుతారు అన్నది ప్రశ్న. అయితే ఈ మూవీ పై దిల్ రాజ్ తో పాటు శర్వానంద్ కూడ చాల ఆశలు పెట్టుకున్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: