హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు అభిమానులకు పండగ ప్రారంభం అయినట్టే. ఈ సవంత్సరం బాక్స్ ఆఫీస్ భారీ వసూళ్ళతోనే ప్రారంభం అయింది. జనవరి మొదటివారంలో అరడజన్ సినిమాలు వచ్చాయి. కానీ అన్ని సినిమాలు చెప్పికునే అంత ఫలితాన్ని సాధించలేక పోయాయి. సంక్రాంతికి వచ్చిన మూవీస్ మంచి వసూళ్ల జల్లును కురిపించాయి. అదే తరణంలో నందమూరి కళ్యాణ్ రామ్ సైతం సంక్రాంతి బరిలో నిలుస్తూ ‘ఎంత మంచివాడవురా సినిమా పోటీకి వచ్చింది.

 

ఈ సినిమాలో హీరో ఈ ఎమోషన్స్ సప్లై అనే కాన్సెప్ట్‌ను ఎంచుకోవడానికి మంచి నేపథ్యాన్నే చూపించారు. చిన్నతనం నుండి ఫ్యామిలీ రిలేషన్స్‌కి ప్రాధాన్యత ఇచ్చే హీరోగా కళ్యాణ్ రామ్‌ని చాలా మంచివాడిగా చూపించారు. ఈ ఎమోషన్స్ సప్లై‌ని కన్వెన్సింగ్‌గా బ్యాలెన్స్ చేయడంలో తాను కన్ఫ్యూజ్ కావడమే కాకుండా ప్రేక్షకుల ఎమోషన్స్‌తో ఆడుకున్నారు దర్శకుడు సతీష్ వేగేశ్న. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నప్పటికీ వాటిని కన్వెన్సింగ్‌గా ప్రజెంట్ చేయలేకపోయారు. ఈ సినిమా అనుకునంతా పెద్దగా ఆడలేదని చెప్పాలి.

 

ఆంధ్ర అమితాబ్‌, మాస్‌ మహారాజా రవితేజ ఖాతాలో సరైన హిట్టు పడక చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చాడో లేక వచ్చిందో తెలియదు గానీ గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే మంచి అభిరుచి గల దర్శకుడిగా పేరు గాంచిన వీఐ ఆనంద్‌ చెప్పిన కాన్సెప్ట్‌ నచ్చడం, అతడిపై పూర్తి విశ్వాసంతో ‘డిస్కో రాజా’  ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు రవితేజ. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు​ సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన డిస్కోరాజా పెద్దగా ఆడలేదు. ఈ సినిమాలో రచయిత అబ్బూరి రవి అందించిన డైలాగ్‌లు పర్వాలేదనిపించాయి. అయితే మాస్‌ మహారాజా స్టైల్లో మాస్‌ మసాలా డైలాగ్‌లు ఎక్కువగా లేవు. ఇక పాటలు అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగ్యశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్‌ ఘట్టాలు పర్వాలేదనిపించాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: