శంకరా అనే మాట వినగానే అందరికి గుర్తుకు వచ్చేది శంకరాభరణం. శంకరా నాదశరీరభార... అనే సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తీర్చి దిద్దారు దర్శకులు కె విశ్వనాధ్ గారు.  సినిమా రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన కే విశ్వనాధ్ గారు పూర్ణోదయా క్రియేషన్స్ తో కలిసి అనేక సినిమాలు చేశారు.  అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  


పూర్ణోదయా సంస్థ సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు మాత్రమే చేసింది.  తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో కీలకపాత్ర పోషించింది.  తెలుగు సినిమాకు ఈ సంస్థ చేసిన కృషి మరువలేనిదని చెప్పాలి.  1976 నుంచి పూర్ణోదయా క్రియేషన్స్ సినిమాలు చేయడం మొదలుపెట్టింది.  1976లో సిరిసిరి మువ్వా సినిమా చేసింది.  కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బ్రహ్మాండమైన విజయం సొంతం చేసుకుంది.  


సినిమా తరువాత ఆ తరువాత 1979లో  నిర్మాత ఏడిద నాగేస్వర రావు గారు పూర్ణోదయా బ్యానర్ పై తాయారమ్మ బంగారయ్య సినిమా చేశారు.  ఈ మూవీ కూడా మంచి విజయం సొంతం చేసుకుంది.  ఆ తరువాత 1980లో చేసిన సినిమా శంకరాభరణం.  ఈ సినిమా దేశంలోనే ఓ గొప్ప సినిమాగా మిగిలిపోయింది.  ఒక్క తెలుగులోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా విజయం సొంతం చేసుకుంది.  


పూర్ణోదయా బ్యానర్ కు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది.  స్వర్ణకమలం అవార్డును అందుకున్న సినిమాగా గుర్తింపు పొందింది.  కె విశ్వనాధ్ దర్శకత్వం, జేవీ సోమయాజులు నటన, కెవి మహదేవన్ సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి.  ఇక వేటూరి సాహిత్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ బ్యానర్లోనే వరసగా సీతాకోక చిలుక, సాగర సంగమం, సితారా, స్వాతిముత్యం, స్వరకల్పన, ఆపద్భాంధవుడు వంటి సినిమాలు రావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: