ఉషాముల్ల‌పూడి నిర్మాత‌గా నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ‌హ‌ర్ష  ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో నాగ‌శౌర్య చిత్రం అశ్వ‌థ్థామ‌. ఈ చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రంవిడుద‌లైన‌ప్ప‌టి నుండి ఫ్లాప్ టాక్ ను మూట గ‌ట్టుకుంది. కాక‌పోతే ఈ చిత్రానికి ప‌బ్లిసిటీ బాగా జ‌ర‌గ‌డంతో కాస్త హైప్ వ‌చ్చింద‌నే చెప్పాలి. రివ్యూలు ప‌ట్టించుకోకుండా. కానీ మొద‌టి రోజు నుంచి సినిమా క‌లెక్ష‌న్ల విష‌యంలో మాత్రం కుమ్మేస్తంద‌నే చెప్పాలి. 

 

అయితే ఈ చిత్రానికి క‌థ నాగ‌శౌర్య రాసుకున్నార‌న్న విష‌యం తెలిసిందే. ఇక నాగ‌శౌర్య కెరియ‌ర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. అందుకు చిత్ర యూనిట్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ చిత్రం విడుద‌లైన రోజే ఫుల్ ట‌పాసులు పేల్చి ఆనందాన్ని అంద‌రూ పంచుకున్నారు. ఈ సినిమా ఖర్చు విషయంలో వెనకాడకుండా రిచ్‌ గా నిర్మించడంతో పాటు పబ్లిసిటీ విషయంలో కూడా చాలా రకాలుగా చేయడం జరిగింది. దాంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లోకి బాగా  రీచ్‌ అయ్యింది. సినిమా ఎంత బాగున్నా కూడా ఆ చిత్రం గురించి న‌లుగురు మాట్లాడుకుంటేనే ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కి వ‌స్తాడు. 

 

అన్ని మీడియా రంగాలు కూడా ఈ చిత్రానికి మంచి ప‌బ్లిసిటీని వ‌చ్చింది.  అందుకే ఈ చిత్రం మొదటి రోజే 3.6 కోట్ల గ్రాస్‌ ను వసూళ్లు చేసినట్లుగా తెలుస్తుంది. ఓవర్సీస్‌ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వీకెండ్ కాబ‌ట్టి వ‌సూళ్ళు వ‌స్తే బాగానే రావొచ్చు చెప్ప‌లేం.  ఈ చిత్రం దక్కించుకునే అవకాశం ఉంది అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

ఒక‌ర‌కంగా చెప్పాలంటే సంక్రాంతి సినిమాల జోరు కాస్త‌ తగ్గింద‌నే చెప్పాలి., ఆ తర్వాత వచ్చిన డిస్కోరాజా చిత్రం మాత్రం నిరాశ పర్చింది. కనుక ఈ వారాంతంలో ప్రేక్షకుల ముందు ఉన్న ఏకైక చిత్రం అశ్వథ్థామ. బ‌హుశా ఏమీ లేక‌పోయే స‌రికి జ‌నాలు ఈ చిత్రానికి వెళుతున్నారు. కానీ ప్ర‌త్యేకంగా క‌థ ప‌రంగా అంత ఆకట్టుకున్న చిత్ర‌మ‌యితే కాద‌నే చెప్పాలి. ఇంక మిగ‌తా క‌లెక్ష‌న్ల గురించి లాంగ్ ర‌న్ లో మ‌న‌కు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: