ఒక్క సూపర్ హిట్ తో లైఫే మారిపోతుంది. స్లోగా సాగిపోతున్న ఇన్నింగ్స్ లో భారీ మార్పులొస్తాయి. సూపర్ ఓవర్ లో రోహిత్ శర్మ హిట్టింగ్ లా కెరీర్ క్రేజీగా సాగుతుంది. ఈ మధ్య కొంచెం స్లో అయిన మెలొడీ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇలాగే సూపర్ హిట్ ఆల్బమ్ తో మళ్లీ అదరగొడుతున్నారు. 

 

సూపర్ హిట్ మెలొడీస్ తో మెప్పించిన అనూప్ రూబెన్స్ కొంచెం స్లో అయ్యాడని చాలా రోజుల నుంచి టాక్ నడుస్తోంది. సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇవ్వలేకపోతున్నామని, స్టార్ హీరోలు, దర్శకులు అనూప్ ని ఇప్పుడు అంతగా ప్రిఫర్ చేయట్లేదని చెబుతున్నారు. దీంతో అనూప్ రూబెన్స్ కెరీర్ డేంజర్ లో పడుతోందనే మాటలు వినిపించాయి. ఇలాంటి టైమ్ లో ఓ మెలొడీ రిలీజ్ చేసి, అందరికీ ఆన్సర్ ఇచ్చాడు అనూప్. 

 

యాంకర్ ప్రదీప్ మాచిరాజు విజిల్ ఫేమ్ అమృతా అయ్యర్ లీడ్ రోల్స్ లో 30రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తెరకెక్కుతోంది. కంప్లీట్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి నీలి నీలి ఆకాశం అనే సాంగ్ రిలీజ్ అయింది.

 

సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్, సునీత కలిసి పాడిన ఈ నీలినీలి ఆకాశం పాటకు నెటిజన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అనూప్ రూబెన్స్ అదరగొట్టాడనే కామెంట్స్ వస్తున్నాయి. అలాగే అనూప్ మళ్లీ మేజిక్ చేస్తున్నాడని, బ్యాక్ టు ఫామ్ అని ప్రశంసలు వస్తున్నాయి. మరి ఈ కాంప్లిమెంట్స్ తో అనూప్ ఇమేజ్ పెరుగుతుందా అనేది చూడాలి. మొత్తానికి అనూప్ రూబెన్స్ మళ్లీ చెలరేగిపోతున్నాడు. మెలొడీ సాంగ్స్ తో ప్రేక్షకులను ఊహాలోకంలో విహరించేలా చేస్తున్నాడు.  ఇటీవల తమన్, దేవిశ్రీ మెలొడీస్ తో ఉర్రూతలూగించగా.. అనూప్ కూడా మళ్లీ అదే బాటపడుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: