తెలుగు సినీ పరిశ్రమలో ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో శంకరాభరణం కూడా ఒకటి. సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం సినీ అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు సినిమా ఖ్యాతిని శంకరా భరణం ప్రపంచమంతా చాటిచెప్పింది. మొదట సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చినా మౌత్ టాక్ తో పుంజుకొని అవార్డులతో పాటు రివార్డులను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.         
 
సామజవరగమన, రాగం తానం పల్లవి, దొరుకునా ఇటువంటి సేవ, ఓంకార నాదాను, శంకరా నాద శరీరాపరా పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. v MAHADEVAN' target='_blank' title='కె వి మహదేవన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కె వి మహదేవన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా విడుదల తరువాత చాలా మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి ఆకర్షితులయ్యారు. వీణలకు కూడా ఈ సినిమా డిమాండ్ పెంచటం గమనార్హం. 
 
సినిమా విడుదల తరువాత ఎక్కువ మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి ఆసక్తి చూపటంతో పాటు వీణలకు కూడా భారీగా డిమాండ్ పెరిగింది. ఒక సినిమా వలన వీణలకు డిమాండ్ పెరగడం అప్పట్లో ఒక సంచలనంగా మారింది. ఒక సినిమా వలన వీణలకు డిమాండ్ పెరిగిందంటే ఈ సినిమా ఎంతగా ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. శంకర శాస్త్రిగా సోమయాజులు, తులసి పాత్రలో మంజు భార్గవి నటించి ఈ సినిమాలో మెప్పించారు. 
 
దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఈ సినిమా ఘన విజయం సాధించింది. విశ్వనాథుని దర్శకత్వం సినిమాకు ప్రధాన ఆయువుపట్టుగా నిలిచింది. తెలుగు సినిమా బ్రతికి ఉన్నంతకాలం ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ప్రముఖ అధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు మూడు రోజులపాటు ఈ సినిమాపై ప్రవచనాలు చెప్పారంటే ఈ సినిమా స్థాయి, గొప్పతనం ఏంటో సులభంగా అర్థం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: