చిత్రపరిశ్రమలో చిరకాలం గుర్తుండిపోయే చిత్రాలు చాలా అరుదని చెప్పవచ్చు. నేటికాలంలో నిర్మించే సినిమాలను చూస్తే ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో, హిట్‌టాక్ ఎప్పుడు సొంతం చేసుకుంటున్నాయో తెలియడం లేదు. అంతే కాక ఇప్పుడు సినిమా షూటింగ్ మొదలు పెట్టగానే వాటికి విపరీతమైన ప్రచారాన్ని కల్పిస్తున్నారు. ఇక ఆ చిత్ర షూటింగ్ ముగించేసరికి సోషల్ మీడియాలో చేసే ప్రచారం దానికి మరింత పాపులారిటిని తెస్తుంది. కానీ 40వ దశకంలో చూసుకుంటే అసలు సినిమాకు ప్రత్యేకమైన ప్రచారాలు అంటు లేనే లేవు. అంతా స్వయంకృషితోనే జరిగేది.

 

 

ఇక శంక‌రాభ‌ర‌ణం సినిమా రిలీజ్ సమయానికి, నాగేశ్వర్రావ్, ఎన్‌టీయార్, శోభన్ బాబు లాంటి వారి కమర్షియల్ చిత్రాల హవా నడుస్తుంది. ఆ సమయంలో ఒక సంగీత ప్రాధాన్యత గల చిత్రాన్ని నిర్మించాలంటే ఏటికి ఎదురీదడమే.. అంతటి సాహాసాన్ని ఏడిద నాగేశ్వరరావు గారు చేసారు. అది కె.విశ్వనాథ్ గారితో కలిసి చేసిన ఈ ప్రయోగం ఊహించని విజయాన్ని అందించింది. కానీ సినిమా విడుదలైన వారం రోజులు ఈ సినిమా అంటే ఏముంది అంతా సంగీత ప్రధానంగా సాగే చిత్రం పరమ వేస్ట్‌రా అనే మాటను మూటకట్టుకుంది.

 

 

కానీ క్రమక్రమంగా ఈ చిత్రానికి ప్రేక్షక ఆదరణ పెరగడం, వేస్ట్ అన్నవారే ఈ చిత్రంలోని సన్నివేశాలకు, కధ కధనాలకు, సంగీతానికి బానిసకాని ప్రేక్షకుడు లేడు.. ఇక ఈ చిత్రనికి కె.వి.మహదేవన్ స్వరపరచిన సంగీతం ప్రాణం పోసింది.. ఇకపోతే కమర్షియల్ సినిమాలకి అలవాటు పడి ఈల‌ల గోల‌లో... వెకిలి చేష్ట‌ల‌తో, బూతు స‌మాహార‌పు పాట‌ల‌తో కొట్టుకుపోతున్న‌ ప్రేక్షకులకు కొండంత సేద తీర్చేలా, హంగు ఆర్భాటం లేకుండా శాస్త్రీయ సంగీత‌మే ఆలంబ‌న‌గా తెలుగువారి మనసులని ఉర్రూత‌లూగిస్తూ, తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచమే నివ్వెర పోయేలా చేసిన ‘శంకరాభరణం’.. కళాత్మక దృశ్య కావ్యం.. కళా తపస్వి కె.విశ్వనాధ్ చేతిలో అత్యంత ర‌మ‌ణీయంగా మ‌లుచుకుంది... ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: