ఫిబ్రవరి స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అయితే..మన హీరోలకు లవ్ సీజన్. ఫిబ్రవరిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతుంటే.. అన్నీ ప్రేమ కథలే. ఒకటి ఫీల్ గుడ్ అయితే.. మరొకటి లవ్ ఎంటర్ టైన్ మెంట్. ఇంకొకటి రొమాంటిక్ లవ్ స్టోరీ. 

 

ఫిబ్రవరి అంతా ప్రేమ కథలదే. 7న రిలీజ్ అవుతున్న జానూతో లవ్ సీజన్ మొదలువుతోంది. తమిళంలో క్లాసిక్ గా నిలిచిన 96ను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేశారు. శర్వానంద్, సమంత ఫస్ట్ టైమ్ జత కట్టగా.. ఒరిజినల్ వెర్షన్ తీసిన ప్రేమ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

 

పెళ్లయిన తర్వాత కూడా సమంత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. యాక్టింగ్ పై తనకు ఎంత మక్కువగ ఉందో నిరూపించుకుంటోంది. అందుకు నిదర్శనం జానూ. శర్వానంద్ తో కలిసి నటిస్తోంది. మిడిల్ క్లాస్  అబ్బాయిలా కనిపించే శర్వా.. జానూ మూవీలో తన ప్రతిభ ఏంటో చూపించబోతున్నాడని అర్థమవుతోంది. సినిమా ట్రైలర్ లు చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతోంది. సెంటిమెంట్ అండ్ లవ్ ఎంటర్ టైనర్ గా అలరించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 7న ఈ మూవీ రానుండటంతో లవర్స్ కళ్లలో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. 

 

ఫిబ్రవరి 14న వస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందింది. యూత్ స్టార్ విజయదేవరకొండ ఇందులో నలుగురు హీరోయిన్స్ రాశీఖన్నా.. ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లాలతో రొమాన్స్ చేశాడు. డియర్ కామ్రేడ్ తో పోగొట్టుకున్న ఇమేజ్ ను ఈ మూవీతో మళ్లీ పాదించుకోవాలనుకుంటున్నాడు విజయ్. 

 

నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ అయితే లవ్ అండ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకుడు కాగా.. ఇప్పటికే రిలీజైన టీజర్.. సాంగ్స్ సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. ఇలా ఫిబ్రవరిలో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ప్రేమ కథల్లో మునిగిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: