రెజీనా కాసండ్రా. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. గతంలో యంగ్ హీరోల స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న రెజీనా ప్రస్తుతం తెలుగులో కనిపించడం లేదు. గ్యాప్ వచ్చినా.. అదంతా భర్తీ చేసేలా బంపర్ ఆఫర్ అందుకుంది. ఇంతకీ రెజీనా తెలుగులో ఏ స్టార్ హీరో పక్కన నటించిందో తెలుసా..!

 

రెజీనా యంగ్ హీరోలను ఇంప్రెస్ చేసినా.. పెద్ద హీరోలను అట్రాక్ట్ చేయలేకపోయింది. రాను రాను యంగ్ హీరోలకు కూడా దూరమైనా.. తమిళంలో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు ప్రేక్షకులు మర్చిపోయిన రెజీనాను చిరంజీవి తన సినిమాతో మళ్లీ పరిచయం చేశాడు. 

 

చిరంజీవి, కొరటాల సినిమాలో రెజీనాకు చోటు దక్కింది. ఇందులో ఫోక్ లోర్ గా సాగే ఐటం సాంగ్ లో చిరంజీవితో చిందులేసిందనీ.. ఆల్ రెడీ పా చిత్రీకరించారని టాక్. రెజీనా ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ కు ఇంప్రెస్ అయిన మెగాస్టార్ ఆమెను మెచ్చుకున్నాడట. 


రెజీనా గతంలో మెగాస్టార్ సాంగ్ రీమిక్స్ కు డ్యాన్స్ చేసి.. ప్రస్తుతం ఏకంగా చిరంజీవితోనే చిందులేసింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సిినిమాలో గువ్వ గోరింక పాట రీమిక్స్ లో సాయి ధరమ్ తేజ్ తో ఆడిపాడింది. మొత్తానికి రెజీనా తనకున్న టాలెంట్ ను చక్కగా వినియోగించుకుంటోంది. జూనియర్లతోనే కాదు సీనియర్లతోనూ నటించేందుకు సై అంటోంది. మెగాస్టార్ చిరంజీవితో పొగడ్తలు కూడా దక్కించుకుంది. మంచి యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రెజీనా.. అందివచ్చిన అవకాశాలను కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటోంది. నటనలోనూ.. అటు డ్యాన్స్ లోనూ హీరోలతో సమానంగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. వెండితెర రారాణిగా వెలుగొందేందుకు రెజీనా చేస్తున్న ప్లాన్లు అన్నీ ఇన్నీ కావు. అందుకే తన అపారమైన టాలెంట్ ను ధారపోస్తోంది ఈ అమ్మడు. చూడాలి మరి.. రెజీనా ప్లాన్లు ఏమాత్రం వర్కవుట్ అవుతాయో.. !

మరింత సమాచారం తెలుసుకోండి: