టాలీవుడ్ ఇండస్ట్రీలో దిల్ రాజు స్టామినానే వేరు. అనుకోవాలే గాని ఏ హీరో తో అయినా డేట్స్ సెట్ చేసుకొని సినిమాని నిర్మించగలడు. ఆయన పబ్లిసిటీ స్టంటే వేరు. సినిమాని ప్రమోట్ చేయాలంటే ఆయన తర్వాతే ఎవరైనా. ఇందుకు మూవి మొఘల్ డా.. డి రామానాయుడు గారి ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది. అంతేకాదు ఒకప్పుడు అల్లు అరవింద్, సురేష్ బాబు కూడా సినిమాలని ఇలానే వినూత్నంగా ప్రమోట్ చేసే వాళ్ళు. అందుకే వాళ్ళ నిర్మాణంలో వచ్చిన సినిమాలు మంచి సక్సస్ ని అందుకున్నాయి. స్టార్ హీరోల సినిమాలు అయినా యంగ్ హీరోల సినిమాలైనా వీళ్ళు ఒకేలా పబ్లిసిటి చేసే వాళ్ళు. ఇంతకముందు దిల్ రాజు కూడా ఇదే ఫాలో అయ్యో వారు. అందుకు ఉదాహరణ శతమానం భవతి సినిమానే. సంక్రాంతి బరిలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికి శర్వానంద్ లాంటి హీరోతో తీసిన శమానం భవతి సినిమాని పబ్లిసిటీ తో నే ప్రేక్షకులను థియోటర్స్ కి లాక్కొచ్చారు. అంతేకాదు సినిమా సూపర్ హిట్ అయ్యోలా చేశారు.

 

అయితే రాజుగారు ఇప్పుడు ఈ స్ట్రాటజీని మార్చారని చెప్పుకుంటున్నారు. చిన్న హీరోల సినిమాలని అసలు పట్టించుకోవడం లేదని బాగా రాజు గారి మీద టాక్ నడుస్తోంది. ఒకేసారి అటు మహేష్ బాబు లాంటి హీరోతో అలాగే రాజ్ తరుణ్, శర్వానంద్ లాంటి యంగ్ హీరోల తో సినిమాలు నిర్మిస్తున్నారు గాని. పబ్లిసిటి విషయంలో మాత్రం వేరియోషన్స్ చూపిస్తున్నారని అంటున్నారు. ఆలోచిస్తే ఇది ముమ్మాటికి నిజమేనని అనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా ఈ మధ్య వచ్చిన రాజ్ తరుణ్ ఇద్దరిలోకం ఒకటే. పాపం అసలు రాజ్ తరుణ్ దిల్ రాజు మీద సక్సస్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో రాజు గారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి గాలికొదిలేశాడు. దాంతో సినిమా ఎప్పుడొచ్చింది ..ఎప్పుడు పోయింది అన్న విషయం కూడా ఎవరికీ తెలీదు. ఫలితంగా రాజ్ తరుణ్ కి గట్టి దెబ్బ పడింది.

 

ఇప్పుడు సమంత-శర్వనంద్ సినిమా జాను విషయంలో కూడా ఇలానే వ్యవహరిస్తున్నారు. ఇంకో నాలుగురోజుల్లో థియోటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాకి ట్రైలర్, ప్రి రిలీజ్ ఈవెంట్ తప్ప మిగతా ఏ పబ్లిసిటీని చేయలేదు. మరి శర్వానంద్ కి ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉన్నప్పటికి ఇప్పుడది అనుమానంగా మారిందట. అందుకు కారణం ఈ సినిమా రిలీజ్ విషయం పెద్దగా జనాలకి తెలీకపోవడమే. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఉన్నప్పుడు సినిమాని అంతగా పట్టించుకోవడం లేదని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. మరి దిల్ రాజు ని నమ్ముకుంటే చిన్న హీరోలకి ఈ షాక్ తప్పదా అని రూమర్స్ మొదలైయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: