శంక‌రాభ‌ర‌ణం.. నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకుంది.. నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మళ్ళి మళ్ళి చూడాలి అనిపించే అంత గొప్ప సినిమా. ఈ సినిమాకు మించి ఇప్పటి వరుకు రాలేదు అంటే మీరు నమ్ముతారా? అంత గొప్ప సినిమా శంకరాభరణం. అయితే ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 

 

40 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా గురించి ఇప్పటికి గుర్తు పెట్టుకున్నారు అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి. అలాంటి ఈ గొప్ప సినిమా గురించి ఎంతో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు కేవలం ఈ సినిమాపైనే మూడు రోజులు ప్రవచనాలు చేశారంటే ఈ సినిమా విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

 

ప్రపంచానికి తెలుగు సినిమా అంటే ఏంటో చూపించిన మొదటి సినిమా శంకరాభరణం. అయన ఈ సినిమా గురించి ఎంత గొప్పగా చెప్పారో ఊహించవచ్చు. ఈ సినిమా 1980లోనే తెలుగు కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం శంకరాభరణం. ఈ సినిమా ఇప్పుడు చుసిన రెండు మూడు రోజులు మన మనసు నుండి కదలదు. అంతటి కళాత్మక చిత్రం ఇది. 

 

సినిమా అఖండ విజయం ఒక్క మన ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలలో కూడా అఖండ విజయం సాధించింది. అలాంటి ఈ గొప్ప సినిమాను 1980 ఫిబ్రవరి 2న విడుదల చేశారు. అమెరికా రెగ్యులర్ థియేటర్స్‌లో విడుదలైన మొట్టమొదటి సినిమా శంకరాభరణం ఏ. 

 

ఇప్పుడు బాహుబలి అంటారు కానీ.. ఈ సినిమాతో పోలిస్తే బాహుబలి ఎంతండీ? ఈ కాలం యువతకు ఈ సినిమా విలువ తెలియదు కానీ అప్పట్లో ఈ సినిమాకు బాహుబలికి వచ్చిన వారికంటే డబల్ వచ్చారు. ఒక సినిమా గురించి ఎన్నడూ మాట్లాడని చాగంటి సైతం సినిమా గురించి మాట్లాడాడు అంటే ఎంత గొప్ప సినిమా అయ్యి ఉండాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: