శంక‌రాభ‌ర‌ణం.. నేటికీ నాలుగు శతాబ్దాలు పూర్తి చేసుకున్న గొప్ప సినిమా ఇది. అంత గొప్ప సినిమాను ఇప్పటికి తలుచుకుంటూ ఉంటారు. ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం.. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా ప్రపంచానికి తెలుగు సత్తా ఏంటో చూపించింది. తెలుగు గొప్పతనం ఏంటో అర్థం అయ్యేలా చేసింది. 

 

ఒక్క తెలుగు భాషాలోనే అఖండ విజయం సాధించలేదు.. తెలుగు రాష్ట్రంలోనే కాదు.. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలలో కూడా అఖండ విజయం సాధించింది. అంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమా భారత దేశానికే అంకితం అవ్వలేదు.. పక్క దేశాలను కూడా పలకరించి వచ్చింది. 

 

ఈ శంకరాభరణం చిత్రం అమెరికాలో రెగ్యులర్ థియేటర్స్‌లో విడుదలైన మొట్టమొదటి చిత్రం. అలాగే ప్రపంచ నలుమూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలై తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం 'శంకరాభరణం'. 

 

అంతటి గొప్ప సినిమా అయినా ఈ సినిమా త‌రాలు మారినా క‌ల‌కాలం నిలిచి ఉండే సినిమా అని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో సంగీతం అద్భుతం.. అసలు తెలుగు సినిమా అంటే ఇది అని గుర్తుచేసే గొప్ప చిత్రం శంకరాభరణం. ఇంతటి గొప్ప చిత్రాన్ని తెలుగు పరిశ్రమకు అందించిన కె.విశ్వనాధ్ గారికి తెలుగు పరిశ్రమ ఎప్పుడు రుణపడి ఉంటుంది. 

 

ఈ తరం యువత కూడా ఎంతో ఇష్టంగా చూసే సినిమా ఇది.. అలాంటి ఈ సినిమాలు కె.వి. మహదేవన్ సంగీతం అందించ‌గా  పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ గొప్ప చిత్రానికి జంధ్యాల మాటలు మాటలు అందించగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం పాటలు పాడారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులుగా జె.వి.సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్ నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: