శంక‌రాభ‌ర‌ణం.. సినిమా వచ్చి ఎంతకాలం అయ్యింది అండి.. మీకు తెలియదా? 40 ఏళ్ళు అయ్యింది ఈ సినిమా వచ్చి. కరెక్ట్ గా 1980లో ఫిబ్రవరి 2వ తేదీన విడుదల అయ్యింది. కరెక్ట్ గా ఈరోజుకి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది శంకరాభరణం చిత్రం. అలాంటి ఈ సినిమాలో ఎంతోమంది నటులు నటించారు.. 

                     

ఆ నటనను చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.. అంత గొప్పగా ఉంటుంది ఆ చిత్రం. శంకరాభరణం చిత్రంలో జేవీ సోమయాజులు, మంజుభార్గవి, బేబీ తులసి, అల్లు రామలింగయ్యల నటన... వెరసి 'శంకరాభరణం' అనే కళాఖండం. అసలు ఈ సినిమాలో నటించిన వారే అసలు సిసలైన నటులు అంటే అని అనేవారు అప్పట్లో ప్రజలు. 

                 

ఆలాంటి ఈ సినిమాలో కేవలం నటులు మాత్రమే కాదు.. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరు అసలైన హీరోలే.. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకు వచ్చిందీ. ఇంకా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వనాద్ కు ఎప్పటికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే అయన తెలుగు పరిశ్రమకు ఇచ్చిన మహోన్నతమైన బహుమతి ఈ శంకరాభరణం చిత్రం. 

                  

అలాంటి ఈ చిత్రానికి విశ్వనాద్ గారు దర్శకత్వం వహించగా జంధ్యాల మాటలు ఇచ్చాడు. ఇంకా ఈ సినిమా పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఎందుకంటే ఈ సినిమా పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి. కళాత్మక దృశ్యకావ్యంగా తెలుగు సినిమా చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిత్రం శంక‌రాభ‌ర‌ణం. 

మరింత సమాచారం తెలుసుకోండి: