తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ అలీ కి మధ్య ఉన్న స్నేహం గురించీ ప్రతీ ఒక్కరికి తెలుసు. ఇద్దరూ ఎంతో సరదాగా, ఆటపట్టించుకుంటూ, ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ నవ్వుల పువ్వులు పూయిస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని అలీ ఓ రేంజ్ లో ఆటపట్టించిన సందర్భాలు అనేకమున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన ప్రతీ సినిమాలో అలీ తప్పకుండా ఉండాల్సిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ లు అయ్యాయి. దాంతో

 

పవన్ సినిమాలో అలీ ఉన్నాడంటే ఆ సినిమా హిట్ అయినట్టే అనే సెంటిమెంట్ ఇండస్ట్రీ లో కొనసాగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్  ఈ సెంటిమెంట్ ని బాగా నమ్మే వాడని ఇండస్ట్రీలో సైతం టాక్ ఉంది. గొప్ప స్నేహితులుగా కలిసి ఉన్న వీరిద్దరూ గత ఎన్నికల సమయంలో శత్రువులుగా మారిపోయారు. పవన్ కళ్యాణ్ సొంత పార్టీ పెట్టిన తరువాత అందరిలానే అలీ కూడా మద్దతు తెలుపుతాడు అని భావించారు అందరూ కానీ అలీ మాత్రం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి మద్దతు తెలుపుతూ, వైసీపీ కండువా కప్పుకుని ప్రచారం చేయడంతో ఇద్దరి మధ్య మరింత గ్యాప్ వచ్చింది...

 

ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ అలీకి చాలా సినిమాలలో అవకాశాలు ఇచ్చాను అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. పవన్ వ్యాఖ్యలకి కౌంటర్ గా అలీ సైతం పవన్ కంటే సినిమాల్లోకి ముందు నేను వచ్చాను అంటూ ఘాటుగానే స్పందిచారు. ఈ గొడవల నేపధ్యంలో ఈ ఇద్దరు భవిష్యత్తులో కలిసే అవకాశం లేదని ఫిక్స్ అయ్యారు అందరూ...కానీ కట్ చేస్తే....

 

పవన్ కళ్యాణ్ తాజాగా మూడు సినిమాలలో నటించడానికి సిద్దమయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు అన్నీ కూడా సామాజిక కోణంలో, సందేశాత్మకంగా ఉండబోతున్నాయనే టాక్ కూడా వచ్చింది. ఎప్పటి లానే తన సినిమాలకి ముందు నుంచీ పనిచేస్తున్న టెక్నికల్ టీమ్ ని సిద్దం చేసుకుంటున్న పవన్ తన సక్సెస్ సెంటిమెంట్ లో భాగమైన అలీని కూడా ఈ సినిమాలలో నటించాలని కబురు పంపాడనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాలు వేరు సినిమాలు వేరు అంటూ అలీని పవన్ బుజ్జగించే పనిలో ఉన్నాడట. ఇదే గనుకా నిజమైతే మళ్ళీ పవన్, అలీ క్రేజీ కాంబోని తెరపై చూడచ్చని అంటున్నారు సినిమా క్రిటిక్స్...

మరింత సమాచారం తెలుసుకోండి: