సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కి సినిమాల పరంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్, బాలీవుడ్ లో ఎలాంటి హీరోతో సినిమా చేసినా బిజినెస్ మాత్రం వర్మ పేరు మీదే అయిపోద్ది. వర్మ ముంబాయి లో ఉన్నన్ని రోజులు ఆయన ఆఫీస్ ముందు నిర్మాతలు సూట్ కేసులు పట్టుకొని సినిమా చేసి పెట్టమని క్యూలో నిలుచునే వాళ్ళు. ఆయన మంచి సినిమా తీయాలే గాని ఇప్పటికి ఆ క్రేజే వేరు. ఇక ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. వాళ్ళలో ముందు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ముందుంటారు.

 

అంతేకాదు క్రియోటివ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న కృష్ణవంశీ, శ్రీను వైట్ల, హరీష్ శంకర్, అజయ్ భూపతి, సిద్దార్థ్ తాతోలు ..ఇలా చాలామంది డైరెక్టర్స్ వర్మ షుల్ల్ నుండి వచ్చినవాళ్ళే. దర్శకులే కాదు చాలామంది టెక్నీషియన్స్ కూడా వర్మ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సస్ అయ్యారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏ టెక్నీషియన్ కూడా వర్మ దగ్గర ఒకటి లేదా రెండు సినిమాల కంటే ఎక్కువ సినిమాలకి పని చేయరని అంటుంటారు. ఇదిలా ఉంటే ఆయన నిర్మాణంలో తెరకెక్కించే సినిమా గాని, ఆయన పర్యవేక్షణలో రూపొందించే సినిమా విషయంలో గాని వర్మ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. అయితే ఈ విషయం ఒక సందర్భంలో స్వయంగా ఒప్పుకునారు కూడా.

 

డైరెక్టర్ హరీష్ శంకర్ మొదటి సినిమా షాక్. మాస్ మహా రాజ రవితేజ, జ్యోతిక ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు. మాస్ రాజా కూడా వర్మ బ్యాచ్ కాబట్టి హరీష్ శంకర్ సినిమాని ఈజీగా ఒప్పుకునాడు. ఆ సినిమా కథ కథనం చాలా బావుంటుంది. హరీష్ శంకర్ నెరేషన్ అద్భుతంగా ఉన్నప్పటికి ఈ సినిమా సూపర్ అన్న టాక్ వచ్చినప్పటికి పెద్ద ఫ్లాప్ మూవీగా మిగిలింది. ఎక్కడో లోపం ఉండటంతో సినిమా ప్రేక్షకులకు సరిగ్గా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఇందుకు అసలు కారణం వర్మ అని ఆయనే తెలిపారు. నేనే అనవసరంగా హరీష్ మేకింగ్ లో వేలు పెట్టానని లేకపోయి ఉంటే సినిమా పక్కా హిట్ అయ్యోదని ఒప్పుకున్నారు. దీని వల్ల హరీష్ శంకర్ రెండో సినిమాకోసం చాలా రోజులు వేయిట్ చేయాల్సి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: