ప్రస్తుతం  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడం మొదలైంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ చైనా వాళ్ళ వక్ర బుద్ది మూలానే అన్న విషయం యావత్ ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే. విమానాశ్రయాల్లో అడుగడుగునా డాక్టర్లు అధికారులు చెకప్ లు చేస్తుండడంతో ఆ ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా పడుతోంది. ఒక్క చైనాలోనే ఇప్పటికి 350 మంది మరణించగా.. 10వేలు పైగా వ్యాధిగ్రస్తులు ఐసీయుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో అందరికి ప్రాణ భయం పట్టుకుంది. నిరంతరం ఏం చేయాలన్నా, ఏం తినాలన్నా కూడా భయంతో వెన్నులో వణుకొచ్చి చమటలు పడుతున్నాయి. చైనా  వైపరీత్యానికి ప్రపంచదేశాలు గజగజలాడిపోతున్నాయి. 

 

ఇక చైనా నుంచి పర్యాటకులు వెళ్లే బ్యాంకాక్ - థాయ్ లాండ్- ఫిజీ సహా పలు ఎగ్జోటిక్ దీవులన్నీ పూర్తిగా స్థంబించిపోయట. అంతేకాదు ఇప్పటికే ఆయా దేశాలకు టిక్కెట్లు బుక్ చేసుకున్న సినిమా సెలబ్రిటీలంతా వాటిని క్యాన్సిల్ చేసుకోవడంతో అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల గత కొంతకాలంగా మాల్దీవుల్లో విహారానికి వెళ్లిన పలువురు సెలబ్రిటీలు కరోనా భయంతో ఇప్పటికే ఇండియాకు తిరిగి వచ్చేశారట. ఇది బాలీవుడ్ టూరిస్టులపైనా అంతే ప్రభావం కనిపిస్తోందిట.

 

ఇక కరోనా ప్రభావం టాలీవుడ్ పై చాలా వేగంగా వ్యాపించే అవకాశాలున్నాయని తాజా వస్తున్న వార్తలను బట్టి అర్థమవుతోంది. రెగ్యులర్ గా బ్యాంకాక్.. థాయ్ ల్యాండ్ సహా పలు ఎగ్జోటిక్ లొకేషన్లకు టూర్లు వెళ్లే సెలబ్రిటీలంతా ఇప్పుడు జాగ్రత్తగా పడుతున్నారట. ప్రతిసారీ స్క్రిప్టు రాసేందుకు బ్యాంకాక్ - థాయ్ ల్యాండ్ కి వెళ్లే పూరి జగన్నాధ్ లాంటి టాప్ డైరెక్టర్ కూడా గోవాతో సరిపెట్టుకుంటున్నారట. అలాగే థాయ్ ల్యాండ్ లోని అడవుల్లో షూటింగ్ కోసం ప్రిపరేషన్స్ చేసుకున్న బన్ని- సుకుమార్ టీమ్ కూడా డ్రాపయినట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఎగ్జోటిక్ డెస్టినేషన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్న పలువురు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు ఫ్లైట్ టిక్కెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారని సమాచారం. కరోనా దెబ్బకు సెలబ్రిటీలంతా ఒణికిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: