టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కొన్నేళ్ల క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, కమర్షియల్ సినిమా గబ్బర్ సింగ్. అంతకముందు హిందీ లో వచ్చిన దబాంగ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అద్భుత నటనతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ ఆకట్టుకునే దర్శకత్వ ప్రతిభ వెరసి ఆ సినిమాని అప్పట్లో అంత పెద్ద విజయవంతం చేసాయి. ఇక మళ్ళి ఇన్నేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ నటించబోయే 28వ సినిమాకు దర్శకుడిగా హరీష్ శంకర్ ఎంపికయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా ఈ ఏడాది జులై లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇటీవల సినిమా స్టోరీ లైన్ విన్న పవన్

 

అది ఎంతో నచ్చడంతో మైత్రి వారి బ్యానర్ పై ఆ సినిమా చేయాడానికి ఒప్పుకున్నారు. ఇక ప్రస్తుతం పూర్తి స్క్రిప్టింగ్ దశలో ఉన్న ఆ సినిమాపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. నిజానికి గబ్బర్ సినిమా ఒక్కసారిగా అంతకముందు పదేళ్లు సరైన హిట్ లేని పవన్ కు అతి పెద్ద బ్రేక్ ని ఇచ్చింది. ఇక ఆ సినిమా కూడా ఎప్పటినుండో పవన్ కి మాస్ హిట్ కావాలని ఆశిస్తున్న తమ ఆశలు నెరవేరుస్తుందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయమై దర్శకుడు హరీష్ శంకర్ ని ఉద్దేశించి కొందరు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కొట్టిన విషయాన్ని మీరు ఏ మాత్రం గుర్తుపెట్టుకోవద్దు, 

 

ఎందుకంటే ఆ హిట్ యొక్క పైత్యం మీ తలకెక్కితే, అతి త్వరలో పవన్ తో తీయబోయే సినిమా పై అది కొంత నెగటివ్ ఇంపాక్ట్ ని కలిగిస్తుందని, కావున ఒకింత జాగ్రత్త వహించి ఆ సినిమా కథ తయారుచేసుకోండి అని పలువురు పవన్ ఫ్యాన్స్, హరీష్ కు కామెంట్స్ రూపంలో సలహాలు ఇస్తున్నారు. అయితే వారి వాదనలో కొంత నిజం ఉందని అంటున్న వారు కూడా ఉన్నారు. ఎందుకంటే గతంలో కొందరు హీరోలు, దర్శకుల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు చూసుకుంటే, మొదటి సారి సూపర్ డూపర్ హిట్ కొట్టిన కాంబినేషన్, రెండవ సారి మాత్రం ఆ రేంజ్ ని అందుకున్న వారు చాలా తక్కువ అని, అందువల్లనే దర్శకుడు హరీష్ ఎంతో జాగ్రత్తతో వ్యవహరిస్తే తప్పకుండా ఈ సినిమా కూడా గబ్బర్ సింగ్ ని మించి విజయాన్ని అందుకుంటుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఓపికపట్టాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: