మెగాస్టార్ తర్వాత ఆయన సపోర్ట్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. మెగా అభిమానుల అండదండతో యువతను మెప్పించే హీరోగా తన స్టైల్, తన యాటిట్యూడ్ తో బాక్సాఫీస్ పై కలక్షన్స్ వర్షం కురిపించాడు పవన్ కళ్యాణ్. కల్యాణ్ గా ఉన్న తనని పవన్ కళ్యాణ్ చేయగా ఆ తర్వాత ఆయనకున్న క్రేజ్ ఫాలోయింగ్ చూసి పవర్ స్టార్ ను చేశారు అభిమానులు. పవన్ కళ్యాణ్ అలా కనబడితే చాలు రికార్డులే అన్న రేంజ్ కు ఆయన ఫాలోయింగ్ పెరిగింది.

 

తెలుగులో పవర్ స్టార్ కు ఉన్న హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకి లేరని చెప్పొచ్చు. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవిని సైతం బీట్ చేసేలా ఆయన క్రేజ్ ఉంది. సినిమా వేడుక ఏదైనా పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా ఉండాల్సిందే. పవర్ స్టార్ పవర్ స్టార్ అని కేకలేస్తూ ఆడిటోరియం దద్దరిల్లేలా చేస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉంది అభిమానులు కాదు ఆయన భక్తులు. పవన్ ను కేవలం అభిమానించడమే కాదు ఆరాధిస్తుంటారు ఫ్యాన్స్.

 

ఆయన ఏం చేసినా సరే అతని వెంట ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ కరువైందని చెప్పొచ్చు. మీటింగులకు లక్షల కొద్ది ఫ్యాన్స్ తరలి వచ్చినా జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తే కనీసం ఒక్కచోట కూడా ఆయన్ను గెలిపించుకోలేదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ చూసి రెండు చోట్ల గెలుస్తాడని భావిస్తే ఫ్యాన్స్ మాత్రం ఆ విషయంలో నిరాశపరచారు.

 

ఎలక్షన్స్ టైం నుండి నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ తిరిగి ముఖానికి రంగేసుకుంటున్నాడు. పింక్ రీమేక్ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత క్రిష్ డైరక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ తో కూడా పవన్ సినిమా ఓకే చేసినట్టు తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: