`అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` అంటూ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆ తర్వాత వరుసగా ఆరు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఎంద‌రో అభిమానులు సంపాదించుకున్నాడు. ఈయ‌న సినిమాలు చూసిన ప్రేక్ష‌కులు ప‌వ‌న్ న‌టన‌కు, స్టైల్‌కు మిస్మ‌రైజ్ అయ్యి ఫ్యాన్స్‌గా మారిన‌వారూ ఉన్నారు. ఇక జాని సినిమా తో పవన్ కు మొదటి ప్లాప్ వచ్చింది. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన కొన్ని సినిమాలు డాజాస్ట‌ర్ అయినా క‌లెక్ష‌న్స్ ప‌రంగా కొత్త‌ రికార్డులు క్రియేట్ చేసేవి. 

 

రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చేసే ముందు చివరిగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన సినిమా 'అజ్ఞాత‌వాసి'. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో 25వ సినిమాగా రూపొందిన అజ్ఞాత‌వాసి 2018 సంక్రాంతికి విడుద‌లైంది. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ అయినా అభిమానులు కలెక్షన్ల వర్షం కురిపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నచ్చి చేసిన సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ సినిమా కోసం మూడేళ్లకు పైగా పనిచేశారు. అయితే తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లోనే భారీ డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది.

 

అయిన‌ప్ప‌టికీ ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ ప‌రంగా దుమ్మురేపింది. అలాగే మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ ని తెచ్చుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కాటమరాయుడు చిత్రం డిజాస్ట‌ర్ అయినా కలక్షన్స్ మాత్రం బాగానే సంపాదించింది. పవన్ స్టామినా ద్వారా మంచి కలక్షన్ లు రాబ‌ట్టింది కాటమరాయుడు. ఇలా ఈ చిత్రాలు డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ క‌నీసం రూ.50 కోట్ల షేర్‌తో సంపాదించుకోవ‌డం విశేషం. కాగా, ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో బిజీ అయిన ప‌వ‌న్ మ‌ళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్ రీఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. పింక్ రీమేక్‌తో రీఎంట్రీ ఇవ్వ‌నున్న ప‌వ‌న్.. దీంతో పాటే ఇటీవ‌లే ప‌లు సినిమాల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ఇక ప‌వ‌న్ రాజ‌కీయ‌ల‌తో పాటు వ‌రుస సినిమాలు చేయ‌డంతో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

 

 

 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: