ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరో. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడుగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన క్రేజ్‌ని సంపాదించుకున్నాడు క‌ళ్యాణ్‌. కెరియ‌ర్ స్టార్టింగ్‌లో ఆయ‌న న‌టించిన చిత్రాలు ఒక‌ర‌కంగా ఉండేవి. ప్ర‌స్తుతం ఇప్పుడు ఆయ‌న న‌టించే చిత్రాలు దాదాపు మెసేజ్ ఓరియంటెడ్‌గా ఉంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే... ఆయ‌న‌కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరో హీరోకి ఉండ‌ద‌ని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు. ఆ విధంగా ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటారు. ఆయ‌న కేవ‌లం సినిమాల్లో మాత్ర‌మే హీరోగా కాకుండా. సామాజిక విలువ‌లు క‌లిగిన ఓ వ్య‌క్తి అని అంటుంటారు అంద‌రూ. 

 

ఆయ‌న ఫ్యాన్స్ కి ఎటువంటి క‌ష్ట‌మొచ్చినా నిల‌బ‌డ‌తాడు. చిన్నా పెద్దా అని చూడ‌కుండా ప్ర‌తి ఒక్క‌రికి గౌర‌వం ఇస్తాడు. అంతేకాక స‌మాజ‌సేవ‌లో కూడా ముందుంటాడు. ఎంత పెద్ద హీరో అయినా కూడా ఎక్క‌డా కొంచ‌మైన ఇగో ఫీలింగ్ అనేది ఉండ‌ద‌ని చాలా మంది చెబుతుంటారు. హీరో అంటే ఓ రేంజ్ మొయింటెయిన్ చేస్తారు. ప‌వ‌న్ అలా కాదు చాలా సాధా సీధా జీవితాన్ని గ‌డుపుతారు. ఎంతో సింపుల్‌గా ఉంటాడు. ఎదైనా ప్రైవేట్ ఫంక్ష‌న్‌లో ఆయ‌న ఫ్యాన్స్ ఆయ‌న గురించి అరుపులు కేక‌లు ఎన్ని పెట్టినా కూడా ఎంతో ఓర్పుగా స‌హ‌నంగా దేనిని కూడా ఆయ‌న ఎప్పుడూ త‌ల‌కెక్కించుకోరు. ప‌వ‌న్ కేవ‌లం ఒక న‌టుడిగానే కాకుండా ఆయ‌న‌లో ఒక రైట‌ర్‌, ఒక డైరెక్ట‌ర్ కూడా దాగి ఉన్నాడు. 

 

త‌న‌ను ఎవ‌రైనా విమ‌ర్శించినా ఏరోజు వాటి పై పెద్ద‌గా స్పందించ‌డు కూడా. ఏదీ ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకుని బాధ‌ప‌డ‌టం. ఎవ‌రినైనా ఒక మాట అన‌డం అనేది ఉండ‌దు. గ‌తంలో ఆయ‌న‌ను క‌త్తిమ‌హేష్‌, శ్రీ‌రెడ్డి లాంటి వారు ఎన్ని విమ‌ర్శ‌ల‌కు గురి చేసిన తిరిగి ఒక్క‌సారి కూడా మాట్లాడ‌లేదు. ఒక‌సారి కూడా వాళ్ళ‌ను ప‌ల్లెత్తి మాట కూడా అన‌లేదు. అందుకే ప‌వ‌న్‌కి కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్  వెన‌క సీక్రెట్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: