షాక్ సినిమా ద్వారా దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ఆ తర్వాత రవితేజతో తీసిన మిరపకాయ సినిమా ద్వారా మంచి విజయం అందుకున్నాడు. మాస్ సినిమాలని తనదైన శైలిలో తెరకెక్కించే ఈ దర్శకుడు ఇటీవల గద్దల కొండ గణేష్ సినిమా ద్వారా మంచి విజయం అందుకున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. మొదటి సారిగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ లో కనిపించాడు.

 

 

అయితే ప్రతీ సినిమాకీ ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు హరీష్ శంకర్ సినిమాకి ఇన్స్పిరేషన్ అయ్యాయి. ఈ విషయాన్ని హరీష్ శంకర్ వెల్లడించాడు. పవన్ కళ్యాన్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పటి వరకూ పవన్ కి అందని ద్రాక్షలా ఉన్న విజయం తన ముందు వచ్చి వాలింది.

 

 

సినిమా హిట్ అయింది. అందరూ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని అంత్యాక్షరి ఎపిసోడ్ సూపర్ సక్సెస్ అయింది. అంత్యాక్షరిలో నటించిన అందరూ విలన్లు టీవీ షోలల్లో దర్శనమిస్తున్నారు. అలాంటి టైమ్ లో హరీష్ శంకర్ పవన్ కళ్యాన్ ని ఒకానొక ఇంటర్వ్యూలో పాల్గొనమని అడిగాడట. సాధారణంగా ఇంటర్వ్యూల మీద కానీ, ప్రమోషన్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టని పవన్ వద్దు అని చెప్పాడట.

 

అప్పుడు హరీష్ శంకర్.. సినిమా విజయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా విజయానికి కారణమైన మీరు కూడా మాట్లాడండి అని చెప్పాడట. అపుడు దానికి పవన్ కళ్యాణ్ మన సినిమా మాట్లాడుతుంది ఇక మనమెందుకు అన్నాడట. ఈ ఒక్క లైనే హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాథమ్ సినిమా కథకి ప్రేరణకి నిలిచిందట.  డీజే సినిమాలో మనం చేసే పనిలో మంచి కనబడాలే గానీ మనిషి కనబడనక్కరలేదు అనే డైలాగ్ ఉంటుంది. సినిమా కాన్సెప్ట్ కూడా అదే.. ఈ విధంగా పవన్ మాటలు కూడా సినిమాగా తెరెకెక్కాయన్నమాట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: