పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ స్టార్ హీరోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాలో ఒక్క సన్నివేశంలో పవన్ కళ్యాణ్ కనిపించినా, పవన్ పేరు వినిపించినా, పవన్ గొంతు లేదా కటౌట్ కనిపించినా చాలు థియేటర్లు దద్దరిల్లిపోతాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలా మంది హీరోలు పవన్ కళ్యాణ్ కు తాము విపరీతంగా అభిమానిస్తామని బహిరంగంగానే చెప్పుకుంటారు. 
 
అక్కడ అమ్మాయి అబ్బాయి సినిమాతో చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తొలి సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా ఆ తరువాత పవన్ నటించిన గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. వరుస విజయాలతో పవన్ కు స్టార్ హీరోగా గుర్తింపు వచ్చింది. 
 
2001 సంవత్సరంలో పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ఖుషి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు కలెక్షన్లలో కొత్త రికార్డులను సృష్టించింది. ఆ తరువాత పవన్ నటించిన కొన్ని సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చింది. పవన్ సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా ఆ సినిమాలు తొలి రోజు కలెక్షన్లలో, తొలి వీకెండ్ కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేసేవి. పవన్ బాక్సాఫీస్ బరిలో దిగితే ఏ ఏరియా అయినా సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతూ థియేటర్లు ప్రేక్షకుల అరుపులతో దద్దరిల్లిపోయేవి. 
 
సీడెడ్, నైజాం, ఆంధ్ర ఏరియాలలో పవన్ సినిమాలు కొత్త రికార్డులను క్రియేట్ చేసి మిగతా స్టార్ హీరోలకు కొత్త టార్గెట్ లను ఫిక్స్ చేసేవి. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు. కానీ ప్రస్తుతం పవన్ వరుస సినిమా కమిట్మెంట్లతో బిజీ అయ్యాడు. పవన్ మరలా బాక్సాఫీస్ బరిలో దిగుతూ ఉండటంతో మరోసారి అన్ని ఏరియాలలో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: