పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... టాలీవుడ్ యువతలో ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ అని పేరులోనే కాదు ఎప్పటికప్పుడు కలెక్షన్లలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ కలెక్షన్లలో కూడా దుమ్ము రేపే సత్తా పవన్ కళ్యాణ్ కు సొంతం . కెరీర్ మొదట్లోనే ఖుషి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ తన సినిమాలతో కలెక్షన్లలో కూడా ఎన్నో సరికొత్త రికార్డులను సృష్టించాడు. 
 
సాధారణంగా ఏ స్టార్ హీరో సినిమాకైనా ఫ్లాప్ టాక్ వస్తే రెండో రోజే థియేటర్లు వెలవెలబోతాయి. కానీ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఫ్లాప్ సినిమాలు కూడా రికార్డు స్థాయిలో షేర్ వసూళ్లను సాధించాయి. పవన్ సినిమా విడుదలయితే చాలు నైజాం, సీడెడ్, ఆంధ్ర ఏరియాలలో సరికొత్త బెంచ్ మార్క్ లు క్రియేట్ అయ్యేవి. 
 
పవన్ సినిమాకు హిట్ టాక్ వస్తే నిర్మాతలకు భీభత్సమైన లాభాలు రాగా పవన్ సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా నిర్మాతలకు నష్టాలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడి హెచ్.డీ క్వాలిటీ ప్రింట్ బయటకు వచ్చినప్పటికీ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయి కలెక్షన్లలో కొత్త రికార్డులను సృష్టించిందంటే అది పవన్ కళ్యాణ్ క్రేజ్ కు నిదర్శనం. తనకు మాత్రమే సొంతమైన నటన, మేనరిజం పవన్ ను మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టాయి. 
 
అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పరిమితం కావడంతో పవన్ నుండి మరొక సినిమా విడుదల కాలేదు. కానీ కలెక్షన్లలో మరోసారి దుమ్మురేపడానికి పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: