సినిమా పరిశ్రమలో ఎవరి ఎలా క్రేజ్ వస్తుందో చెప్పడం కష్టం. కొందరు ఇలా వచ్చి అలా వెళ్తుంటారు కాని కొందరు మాత్రం ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోతారు. అలాంటి వారిలో ఒకరు శ్రీయ శరణ్. ఇష్టం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ అమ్మడు తన అందంతో పాటుగా అభినయంతో మెప్పించింది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఈ అమ్మడు ఇప్పటికి అవకాశాలు అందుకుంటుంది.

 

సీనియర్ స్టార్ హీరోలకు మొదటి ఆప్షన్ గా ఆఫర్లు అందుకుంటున్న శ్రీయా శరణ్ పెళ్లి తర్వాత కెరియర్ ముగుస్తుందని అనుకోగా అంతకు మించి ఆఫర్లు వస్తున్నాయి. అయితే తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా అదరగొడుతుంది అమ్మడు. పెళ్లి తర్వాత మరింత హాట్ గా కనిపిస్తున్న శ్రీయా శరణ తన లేటెస్ట్ పిక్స్ తో కుర్రాళ్లకు డిస్ట్రబ్ చేస్తుంది. ఏజ్ 40కి దగ్గర పడుతున్నా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు.

 

కళ్లతోనే కోటి భావాలు పలికేలా కనిపిస్తున్న శ్రీయా శరణ్ తనని తాను అద్దంలో చూసుకుంటూ ఆడియెన్స్ కు ముందు ముఖారవిందం.. వెనుక వీపు భాగం కనిపించేలా ఆకట్టుకుంటుంది. ఇలా ఆమెను చూస్తుంటే ఆ కనులలో కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా అంటూ వేటూరి రాసిన పాట మన హృదయం రాగమెత్తుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న నారప్ప సినిమాలో శ్రీయా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ అసురన్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో శ్రీయ మరోసారి తన సతా చాటాలని చూస్తుంది. చూస్తుంటే అమ్మడికి తెలుగులో మళ్లీ మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: