టాలీవుడ్ స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే భిన్నమైన వ్యక్తి. సాధారణంగా స్టార్ హీరోలు ఎవరూ తమ వ్యక్తిగత విషయాలను పబ్లిక్ గా చెప్పటానికి ఇష్టపడరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ విషయాలనైనా, వ్యక్తిగత విషయాలనైనా ధైర్యంగా చెప్పగలిగే హీరో. జీవితంలో ఏ స్టార్ హీరో కూడా తన అప్పుల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి బహిరంగంగా చెప్పరు. 
 
కానీ ఎన్నో సందర్భాలలో నిజాయితీగా పవన్ కళ్యాణ్ ఆర్థికంగా తాను ఇబ్బందులలో ఉన్నానని తన దగ్గర డబ్బులు లేవని నెల గడపటమే తనకు కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. అజ్ఞాతవాసి సినిమా తరువాత కొంతకాలం సినిమాలకు దూరమై రాజకీయాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఆర్థికంగా నిలబెట్టటం కొరకు తాను మరలా సినిమాల్లో నటిస్తున్నట్టు ప్రకటన చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ మూడు సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 
 
సినిమా ఇండస్ట్రీలో చిన్న స్థాయి నటుల నుండి స్టార్ హీరోల వరకు తమ వ్యక్తిగత విషయాల గురించి అప్పుల గురించి చెప్పుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి దమ్ము, ధైర్యం, తెగువ కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే సొంతం. మరే హీరోకు ఇంత దమ్ము, ధైర్యం, తెగువ లేదని సవాల్ చేసి మరీ చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నాడు. 
 
ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాల్లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 2021 సంక్రాంతి పండుగకు విడుదల కానుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలొ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పింక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: