క్రేజ్ కు మరో పేరు పవన్ కళ్యాణ్.. అభిమానుల గుండెల్లో చెదిరిపోని స్దానాన్ని కైవసం చేసుకున్న పవన్ అంటే ప్రతి అభిమానికి ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఒకప్పుడు చిరంజీవి తమ్ముడు హీరో అయ్యాడట అనే దగ్గర నుండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అని చెప్పుకునే స్థాయి కి ఎదిగాడు. ఆయనకున్న ఫ్యాన్ బేస్ తెలుగు లో ఏ హీరో కి లేదని చెప్పవచ్చు. కెరీర్ లో ఎన్ని పరాజయాలు వచ్చిన ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. అస్సలు క్రేజ్ కి కేరాఫ్ అడ్రస్ పవర్ స్టార్.

 

 

అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన పవన్ కళ్యాణ్, తొలి ప్రేమ , తమ్ముడు , బద్రి , ఖుషి ఇలా వరుస హిట్ల తో యూత్ ఐకాన్ గా మారిన ఒక ఎవరెస్ట్ అని చెప్పాలి. దాదాపు 7 ఏళ్ళ వరకు హిట్ ఎరుగని పవన్ కి ఒక్క ఫ్యాన్ కూడా తగ్గలేదంటే ఆయన క్రేజ్ ఏపాటిదో మనం అర్ధం చేసుకోవొచ్చు. ఖుషి సినిమా టైం లో పవన్ క్రేజ్ మామూలుగా లేదు, ఇదేకాకుండా డాడీ సినిమా కి పవన్ ఫైట్ మాస్టర్ గా చేసాడని తెల్సి, కేవలం పవన్ కళ్యాణ్ కంపోస్ చేసిన ఫైట్ల కోసమే జనం ఎగబడ్డారు అంటే ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

 

ఇక గబ్బర్ సింగ్ లో నేను ట్రెండ్ ని ఫాలో అవ్వను సెట్ చేస్తాను అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అక్షర సత్యం. పవన్ చేసిన ప్రతి ట్రెండ్ ని మిగతా హీరోలు ఫాలో అవుతూ వచ్చారు.  ఇలా ప్రతిది ఆయన క్రియేట్ చేసిన ట్రెండ్. బాలు సినిమాలో పవన్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవ్వని యూత్ లేదు. పవన్ వేసుకున్న కాస్ట్యూమ్స్ బయట మార్కెట్లో విడుదల చేసి సొమ్ము చేసుకున్న వ్యాపారులు కూడా ఉన్నారు..

 

 

ఇక ఒక దశలో పరాజయాలు వెంటాడుతున్న, ఫాన్స్ ఆయన వెన్నంటే ఉన్నారు. పులి, తీన్మార్, పంజా లాంటి సినిమాలు పవన్ కెరీర్ లో ఒక మాయని మచ్చల మిగిలిపోయాయి. అయినా మళ్ళి హిట్ తో బాక్స్ ఆఫీసు షేర్ అనిపించు కున్నాడు పవర్ స్టార్. అందుకే అంటారు బాల‌వ‌ర‌పు వ‌క్కండేశ్వ‌ర‌రావు అలియాస్ బాలు నుండి .. గ‌బ్బ‌ర్‌సింగ్ వరకు రోల్ ఏదైనా ప‌వ‌న్ స్టైలే వేరప్పా అని.. 

మరింత సమాచారం తెలుసుకోండి: