గత ఏడాది హ్యాట్రిక్ డిజాస్టర్లను ఖాతా లో వేసుకున్న మాస్ మహారాజ్ రవితేజ  ఈఏడాది ప్రారంభం లో డిస్కోరాజా తో మరో డిజాస్టర్ ను చవిచూశాడు. మంచి అంచనాల మధ్య ఇటీవల విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ రివ్యూస్ ను రాబట్టుకోవడంతో  విడుదలైన రెండో రోజు నుండే బాక్సాఫీస్ వద్ద  చేతులెత్తేసింది.
 
ఇక నిన్నటివరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 7.46కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.  ఈచిత్రం సుమారు 20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ విఆనంద్ తెరకెక్కించిన ఈ  చిత్రంలో  నాభా నటేష్ , పాయల్ రాజ్ పుత్  కథానాయికలుగా నటించగా నేల టిక్కెట్టు నిర్మాత  రవి తల్లూరి ఈచిత్రాన్ని నిర్మించాడు.  ఈరెండు సినిమాలు రవి తల్లూరిని నిలువునా ముంచేశాయి. 

ప్రపంచ వ్యాప్తంగా డిస్కోరాజా  వసూళ్ల వివరాలు : 
 
నైజాం - 2.8 కోట్లు 
సీడెడ్ - 0.9 కోట్లు 
ఉత్తరాంద్ర - 0.85 కోట్లు 
గుంటూరు -0.4 కోట్లు 
తూర్పు గోదావరి - 0.55 కోట్లు 
పశ్చిమ గోదావరి - 0.39 కోట్లు '
కృష్ణా - 0.42 కోట్లు 
నెల్లూరు - 0.15 కోట్లు 
తెలుగు రాష్ట్రాల్లో 10రోజులకు గాను  షేర్ = 6.46కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా +రెస్ట్ అఫ్ వరల్డ్ =  1కోటి 
ప్రపంచ వ్యాప్తంగా  డిస్కోరాజా 10రోజుల  షేర్ = 7.46 కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: