ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన నటి విజయశాంతి తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వెళ్లారు.  తన గ్లామర్ తో అలరించిన విజయశాంతి కొంత కాలం తర్వాత ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ పాత్రల్లో నటించి మెప్పించారు. కర్తవ్యం మూవీ ఆమెలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది.  ఈ మూవీ తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిచంచి లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్నారు.  ఒసేయ్ రాములమ్మ తర్వాత ఆ తరహా పాత్రల్లో ఆమెను ప్రేక్షకులు ఎక్కువగా చూడలేకపోయారు. దాంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు విజయశాంతి. మొదట బిజెపి లో చేరిన ఆమె అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 

 

తల్లితెలంగాణ పార్టీ స్థాపించి ఆమె తర్వాత టీఆర్ఎస్ లో విలీనం చేశారు.  కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎంపిగా గెలుపొందారు.  అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తో విభేదాలు రావడం.. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం జరిగింది.  రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయశాంతి పదమూడేళ్ల తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో రీ ఎంట్రీ ఇచ్చింది.  అయితే భవిష్యత్ లో ఆమె సినిమాలకు అంకితం అవుతారని అందరూ భావించారు. తాజాగా తన సినీ ప్రయాణం గురించి విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.

 

1979లో 'కళ్లుకుల్ ఇరమ్' సినిమా నుంచి ఇప్పటి 'సరిలేరు నీకెవ్వరు' వరకు తనను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు అని అన్నారు. ఈమేరకు ఆమె వరుస ట్వీట్లు చేశారు. ప్రజా జీవన పోరాటంలోనే తన ప్రయాణం కొనసాగుతుందని ఆమె తెలిపారు. ప్రస్తుతం తన జీవితం ప్రజలకే అంకితం..ఈ నేపథ్యంలో తాను మరిన్ని మూవీస్ లో నటిస్తానో లేదో అన్న వ్యాఖ్యలు చేశారు.  ఇప్పటికిక సెలవు అని చెప్పారు. మీ ఆదరణకు, తన ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అని అన్నారు. 'సరిలేరు నీకెవ్వరు' వంటి గొప్ప విజయాన్ని నాకు అందించి, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న అభిమానులకు ధన్యవాదాలు అని చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: