మొండితోక జగన్‌మోహన్ రావు...వైద్యుడిగా ఎన్నో ఏళ్ళు కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించిన నాయకుడు. ఇక ప్రజలకు మరిన్ని సేవలు అందిచాలనే ఉద్దేశంతో వైద్య వృత్తి నుంచి రాజకీయంలోకి ఎంటర్ ఇచ్చారు. అది కూడా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఏపీ ప్రజల గుండెల్లో దేవుడుగా ముద్రవేసుకున్న దివంగత వైఎస్సార్ అడుగుల్లో నడవాలనే లక్ష్యంతో  2013లో ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీలో చేరారు.

 

ఇక చేరడమే ఆయనకు 2014లో నందిగామ టికెట్ ఇచ్చింది. కానీ ఊహించని విధంగా ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఓడిపోయినా..వెనక్కి తగ్గకుండా ప్రతిపక్షంలో ఉండే పోరాటం చేశారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉండే సుబాబుల రైతులకు అండగా నిలిచారు. ఈ విధంగా కష్టపడటం వల్లే 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఈ నందిగామ జగన్...నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నారు.

 

అలాగే నియోజకవర్గంలో ఉన్న సుబాబుల్ రైతుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామానికి, వార్డుకు సిమెంట్ రోడ్లు నిర్మాణమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. కాకపోతే రోడ్లు విషయంలో తప్ప నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి ఏం జరగలేదు. అటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష టీడీపీపైన కౌంటర్లు ఇవ్వడంలో వెనుకబడి ఉన్న...అసెంబ్లీలో ఏదైనా సమస్య మీద అర్ధవంతంగా చర్చ చేయడంలో ముందున్నారు.

 

ఇక ఓవర్ ఆల్‌గా చూసుకుంటే నందిగామ జగన్ వర్క్ బాగానే ఉంది. కానీ నందిగామ అమరావతి దగ్గరలో ఉండటం వల్ల ఇక్కడి ప్రజలు కొందరు రాజధాని విషయంలో అమరావతిపై మొగ్గు చూపుతున్నారు. అలాగే కొందరు మూడు రాజధానులని కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయితే మెజారిటీ మాత్రం అమరావతి వైపే ఉన్నట్లు తెలిసింది. మరి దీని వల్ల మూడు రాజధానులకు మద్ధతు ఇస్తున్న వైసీపీకి భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: