పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు చేస్తూనే మరో పక్క సినిమారంగంలో  వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటంతో ఆయన అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు. కాగా సినిమాల్లో పవన్ కళ్యాణ్ తన నిజ జీవితంలో అనుసరించే విధానాలు అనుకరిస్తూ ఇతరులను ప్రభావితం చేసే విధంగా చాలా రిజర్వ్డ్ గా ఉంటారు అనే చాలామంది ఇండస్ట్రీలో పవన్ తో పని చేసిన వారు అంటారు. ముఖ్యంగా సమాజానికి ఏదో ఒక మెసేజ్ సాంగ్ లో గాని ఒక సన్నివేశంలో గాని ఇవ్వడానికి ఎక్కువగా పవన్ ఇష్టపడతాడు.

 

అంతే కాకుండా తన సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో చాలా కేర్ పవన్ కళ్యాణ్ తీసుకుంటారట. సన్నివేశానికి మించి సెట్లో హీరోయిన్ తో మాట్లాడే హీరో మాత్రం పవన్ కళ్యాణ్ కాదని చాలామంది ఆయనతో పనిచేసిన డైరెక్టర్లు చెబుతున్నారు. కేవలం ఆయన పని ఎంతో అంతవరకే మాత్రమే హీరోయిన్ తో ఉంటుందని అది పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ అని ఇండస్ట్రీలో మిగతా హీరోల మాదిరిగా పవన్ కళ్యాణ్ సినిమా సెట్లో వాతావరణం ఉండదని అంత డిసిప్లేన్ గా ఉంటుందట. సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ సన్నివేశాలలో కూడా...హీరోయిన్ ని ఎక్కువగా టచ్ చేసే సన్నివేశాలు స్క్రిప్టులో లేకుండా ముందు నుండే...డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ చర్చస్తారట.

 

అయితే ప్రస్తుతం రాజకీయాలు చేస్తూ మరో పక్క సినిమాలు చేస్తున్న తరుణంలో మ్యాగ్జిమం మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే పవన్ కళ్యాణ్ చేయనున్నట్లు ఫిలింనగర్ లో టాక్. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ రీమేక్ సినిమా 'పింక్' తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా అయిన వెంటనే డైరెక్టర్ క్రిష్ మరియు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: