చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకు ‘కోబ్రా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవల ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను  విడుదల చేశారు. ఇది విక్రమ్‌కు 58వ సినిమా. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో క్రికెట్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.   వేసవి సెలవులపై కనేసిన విక్రమ్ మే 22 న కోబ్రా సినిమా విడుదల చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు.  దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ కోలీవుడ్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో విక్రమ్ దర్శకుడు మణి రత్నం తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ పొన్నియిన్ సెల్వన్ మూవీలో నటిస్తున్నారు.

 

ఇటీవలే థాయిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది. కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయి, మోహన్ బాబు వంటి భారీ క్యాస్టింగ్ పొన్నియిన్ సెల్వన్ మూవీలో నటిస్తున్నారు. అయితే ‘కోబ్రా’ మూవీ చియాన్ విక్రమ్ కెరీర్లో ఓ మరుపురాని మైలురాయిలా తీర్చిదిద్దబోతున్నారట దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు.   ఓ ఆసక్తికర అంశంతో కోబ్రా సినిమా తెరకెక్కిస్తున్నారని సమాచారం. గతంలో విక్రమ్ అపరిచితుడు, ఐ లాంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఈసారి కోబ్రా తో మరో సంచలనం సృష్టించబోతున్నట్లు దర్శకులు, చిత్ర యూనిట్ అంటున్నారు.  

 

సినిమా మోషన్ పోస్టర్ చూస్తేనే దిమ్మతిరిగేలా ఉంది.. మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని చియాన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగ ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి గత కొంత కాలంగా విక్రమ్ కి ఏ మూవీ కలిసి రావడం లేదు. ప్రస్తుతం ఈ కోబ్రాపైనే మనోడు ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: