సరిలేరు నీకెవ్వరు హిట్ తర్వాత రష్మిక జాతకం మారిపోయింది. ఛలో.. గోవింద గోవింద సక్సెస్ తీసుకువస్తే.. సరిలేరు నీకెవ్వరు హిట్ రష్మికను టాప్ ఛైర్ లో కూర్చోబెట్టింది. ఈ క్రమంలో బంపర్ ఆఫర్ కొట్టేసింది రష్మిక. ఇంతకీ రష్మిక రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. 

 

రష్మిక ఫస్ట్ టైమ్ స్టార్ హీరోతో నటించిన సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ కావడంతో.. ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. చాలామంది స్టార్స్ ఈ అమ్మడిపై కన్నేశారు. ఎలాగైనా తమతో నటిస్తే బాగుంటుందని ఉవ్విళ్లూరుతున్నారు. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కు ముందే.. సుకుమార్ సినిమాలో అల్లు అర్జున్ పక్కన సెలక్ట్ అయింది. మరోవైపు భీష్మ మూవీలో నితిన్ తో నటిస్తోంది. 

 

సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటోంది రష్మిక. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా రష్మికను సెలక్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. 

 

కన్నడ భామ రష్మిక సుల్తాన్ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ.. కార్తీతో జత కడుతోంది. కోలీవుడ్ లో రెండో సినిమాను కూడా సొంతం చేసుకుంది. పోలీస్ కథలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన హరి తన దర్శకత్వంలో రష్మిక పేరు పరీశిలిస్తున్నట్టు సమాచారం. సూర్య సరనసన నటిస్తూ... తమిళంలో అన్నదమ్ములిద్దరినీ కవర్ చేస్తోంది రష్మిక. సరిలేరు నీకెవ్వరుతో  రెమ్యునరేషన్ పెంచడంతో పాటు.. భారీ ఆఫర్స్ అందుకుంటోంది. 

 

మొత్తానికి రష్మికను అధృష్టం గట్టిగా పట్టింది. అందుకే వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఎంత చెబితే అంత ఇచ్చి తమ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. అదంతా సరిలేరు నీకెవ్వరు పుణ్యమా అని రష్మిక క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇంకేముందీ ఆమె రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసింది. మొత్తానికి ఇపుడు రష్మిక హవా కొనసాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: