సుడిగాలి సుధీర్‌.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌డం అవ‌స‌రం లేని పేరు. ఎలా వచ్చాం.. ఎక్కడ్నుంచి వచ్చాం.. అనేది కాదు ఎలా ఎదిగాం.. ప్రస్తుతం మనమెక్కడున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ లైన్ సుధీర్ ఖ‌చ్చితంగా స‌రిపోతుంది. జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్స్ తెలుగు తెరకు వచ్చారు.. వెళ్లిపోయారు కానీ కొందరు మాత్రమే అక్కడే సెటిల్ అయిపోయారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటుడు సుడిగాలి సుధీర్. అయితే సుధీర్ జ‌బ‌ర్ద‌స్త్‌కు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా టీవీ షోలతో పాటు యాంకర్, డాన్సర్, మెజీషియన్‌గా కూడా సత్తా చూపిస్తున్నాడు. ప్ర‌స్తుతం సుధీర్ పెళ్లి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అనే చెప్పవచ్చు. 

 

అలాంటి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే సుధీర్ అని పేరు చెప్ప‌గానే ర‌ష్మీ ఎక్క‌డా అని అడిగేవాళ్లు ఎంద‌రో. ర‌ష్మీ, సుడిగాలి సుదీర్ ల మధ్య నడిచే కెమిస్ట్రీ గురించి వీక్షకుల్లో అందరికీ విపరీతమైన ఇంట్రస్ట్ ఉంది. వీరిద్దరూ స్కిట్ ల సమయంలో చేసే చిలిపి సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. దీంతో వీళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగింది. కాని, వాళ్లు మాత్రం మా మ‌ధ్య ఏం లేదంటూ ఎన్నో సంద‌ర్భాల్లో పేర్కోన్నారు. ఇదిలా ఉంటే..  సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను కలిసి నటిస్తున్న త్రీ మంకీస్ ప్రమోషన్స్‌లో భాగంగా సుధీర్ పెళ్లి గురించి తరచూ చెబుతున్నారు. 

 

ఓ ఇంటర్వ్యూలో రాంప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ పెళ్లిసంబంధాలు వెతుకుతు న్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు రాష్ట్రంలో అందరికన్నా సీనియర్ బ్రహ్మచారి ప్రదీప్ అని చెబుతూనే, సుడిగాలి సుధీర్ కోసం విదేశాల్లో సైతం పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే ఇది సరదాగా అన్నారా... లేక నిజంగానే సుడిగాలి సుధీర్ కోసం విదేశీ అమ్మాయిను వెతుకుతున్నారా అనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్ విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ర‌ష్మీ ప‌రిస్థితి ఏంటి అంటూ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు.


  
 

మరింత సమాచారం తెలుసుకోండి: