గ్లామర్ క్వీన్ పాయల్ రాజ్ పుత్.. యాక్షన్ క్వీన్ గా మారుతోంది. ఇన్నాళ్లూ బోల్డ్ నెస్ తో కుర్రాళ్ల హృదయాలను దడదడలాడించిన పాయల్ రాజ్ పుత్.. ఇపుడు మరో రకంగా భయపెడుతోంది. ది డేంజర్ లేడీ అనే తరహాలో పైట్లు చేస్తోంది. మరి గ్లామర్ లేడీ, లేడీ బ్రూస్ లీ గా మారాడానికి గట్టి కారణాలే ఉన్నాయి. 

 

రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అనగానే ఆడియన్స్ కు ఠక్కున ఆర్.ఎక్స్.హండ్రెడ్ గుర్తొస్తుంది. ఓ బోల్డ్ హీరోయిన్ కనిపిస్తుంది. అయితే ఈ హీరోయిన్ మాత్రం ఇప్పుడీ ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ రోల్స్ పక్కనపెట్టి కొంచెం కొత్తగా ట్రై చేస్తోంది. ఈ ఇదిలోనే జయంత్.సి.ఫరాంజీ దర్శకత్వంలో నరేంద్ర అనే సినిమాలో ఫైటర్ పైలట్ గా నటిస్తోంది పాయల్ రాజ్ పుత్. 

 

రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ప్రీవియస్ మూవీ డిస్కోరాజా. ఈ సినిమాలో చెవిటి మూగ అమ్మాయి పాత్ర పోషించింది పాయల్ రాజ్ పుత్. పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న ఈ క్యారెక్టర్ తో కొత్త కోణం చూపించింది. ఇక అంతకుముందు ఆర్డీ ఎక్స్ లవ్ సినిమాలోనూ ఫైట్లు చేసింది పాయల్. సో పాయల్ సినిమాల సెలక్షన్ చూస్తే.. ఈ గ్లామర్ ఇమేజ్ ను చెరిపేసుకోవడానికి ట్రై చేస్తుందనే చెప్పొచ్చు. మొత్తానికి పాయల్ రాజ్ పుత్... గ్లామర్ ఇమేజ్ ను పక్కనపెట్టేస్తోంది. యాక్షన్ క్వీన్ గా మారిపోయి ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. పాయల్ ఏంటి ఇలా మారిపోయిందే అని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంత మార్పు ఈమెలో ఎలా వచ్చిందబ్బా అని గుసగుసలాడుకుంటున్నారు. గ్లామర్ కోసం ఆరాటపడాల్సిందిపోయి.. రఫ్ గా తయారవడమేంటి అని అనుకుంటున్నారు. మొత్తానికి పాయల్ గ్లామర్ క్వీన్ ఇమేజ్ ను పక్కన పెట్టి యాక్షన్ క్వీన్ గా మారిపోయింది. ఇన్నాళ్లూ బోల్డ్ నెస్ తో కుర్రాళ్ల హృదయాలను దడదడలాడించిన పాయల్ రాజ్ పుత్.. ఇపుడు మరో రకంగా భయపెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: