మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చి పవర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యణ్ హిట్టు సినిమా పడితే బాక్సాఫీస్ లెక్కలు మారాల్సిందే. అంతేకాదు పవర్ స్టార్ సినిమా ఫ్లాపైనా సరే రికార్డులు కొట్టేస్తాడు. అదేంటి ఫ్లాపైనా రికార్డ్ ఎలాగా అనుకుంటారా అంటే పవర్ స్టార్ సినిమా ఎనౌన్స్ అయిన దగ్గర నుండి రిలీజ్ డేట్ వరకు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు సినిమా టీజర్, ట్రైలర్ ను అతి తక్కువ టైంలో రికార్డ్ వ్యూస్ సాధించేలా చేస్తారు.

 

ఈ క్రేజ్ తో పవన్ సినిమా ఏదైనా సరే మొదటి రోజు కలక్షన్స్ తోనే రికార్డులు సృష్టిస్తారు. పవన్ సినిమా మొదటి ఆటకు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. ఆయనో పవర్ హౌజ్ అందుకే పెద్దగా డైలాగులు చెప్పకపోయినా.. డ్యాన్స్ చేయకపోయినా పవన్ బొమ్మ కనబడితే ఆ హుశారు వేరేలా ఉంటుంది. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ట్రెండ్ ఫాలో అవడు సెట్ చేస్తాడు.. అది ఆయన సినిమా డైలాగే అయినా అది నిజమని చెప్పొచ్చు.

 

ఖుషి తర్వాత పదేళ్లు హిట్టు లేకపోయినా సరే అభిమానుల్లో క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అందుకే సరైన సినిమా ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్ సినిమా చూపించింది. హరీష్ శంకర్ డైరక్షన్ లో పవన్ చేసిన ఆ సినిమా పవన్ కెరియర్ లో అప్పటివరకు ఉన్న రికార్డులు చెరిపేసి కొత్త రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమా కూడా పవన్ కెరియర్ లో ది బెస్ట్ హిట్ గా నిలిచింది. అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మరి ఈ సినిమాలతో ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: