వివాదల దర్శకుడు రాం గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ట్వీట్స్ పెడుతుంటాడన్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పటి నుండి ఆయన మీద వర్మ ఏదో ఒక వంకర మాటలు మాట్లాడటం కామెంట్స్ చేయడం షరా మామూలూగా జరిగింది. ఇక ట్వీట్స్ అయితే చెప్పక్కర్లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఏ ఒక్కదానికి స్పందించకుండా తన పనేదో తను చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఒక ముని లాగా అన్ని భరిస్తూ మౌనంగా చిన్న చిరునవ్వుతో ఉండిపోతారు.

 

కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం అసలు ఊరుకోరు. మేము దేవుడిలా భావించే మా పవర్ స్టార్ మీద ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తావా అని వర్మ మీద తిరిగి ట్వీట్ల తో ఎదురు దాడి చేసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వర్మ పవన్ ని ఉద్దేశించి ఒక్క ట్వీట్ చేస్తే ఆయన కల్పించుకోకుండానే ఆయన అభిమానులు మెగా అభిమానులు దొరికొతే వర్మ సంగతి చూస్తాము అన్నంత రేంజ్ లో విరుచుకుపడుతుంటారు. ఒక్కోసారి వర్మ పైత్యం మరీ ఎక్కువవుతుండటంతో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి హద్దులు దాటి మరీ పిచ్చి కూతలు కూస్తుంటాడు. అలాంటి సమయంలో పవన్ ఫ్యాన్స్, మీడియా మిత్రులు ..వర్మ మిమ్మలిని అన్ని మాటలు అంటుంటే మీరు ఒక్క మాట అన్రేంటి అని అడిగిన ప్రశ్న కి పవన్ ఇచ్చిన సమాధానం నిజంగా వర్మ వింటే జీవితంలో ఇంకోసారి అలాంటి పనులు చేయడు. 

 

పొద్దున్నే లేచి పోర్న్ చూసేవాడికి నన్నేం సమాధానమిమ్మంటారు ...అంటూ పవన్ అన్న ఒక్క మాట వర్మ చేసిన 100 ట్వీట్ల తో సమానం అయిపోయింది. అది పవర్ స్టార్ అంటే. కానీ వర్మ కి ఇలాంటివి సరిపోవు. అందుకే ఒకసారి శ్రీ రెడ్డికి సపోర్ట్ చేస్తూ నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ ని నానా మాటలు అన్నాడు. అంతేకాదు ఆయన వ్యక్తిగత విషయాల గురించి గుచ్చి గుచ్చి మాట్లాడాడు. దాంతో పవన్ కళ్యాణ్ కోపం కట్టలు తెంచుకుంది. ఫిల్మ్ చాంబర్ సాక్షిగా పవన్ వర్మ కి సవాల్ విసిరాడు. దమ్ముంటే ఇప్పుడు ఇక్కడికి రావాలని డిమాండ్ చేశాడు. కాని వర్మ మాత్రం స్పందించకుండా క్షమాపణలు కోరాడు. అప్పుడే వర్మ కి పవన్ గట్టిగా ఇంకోసారి ఇలా నోటికొచ్చినట్టు కారు కూతలు కూస్తే నాలుక కోసి కారం పెడతా అన్న లెవల్ లో వార్నింగ్ ఇచ్చాడు. సున్నితమైన మనస్తత్వం కాబట్టి ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు పవన్ కళ్యాణ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: