ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో ఫేమస్ అయిన పూరి జగన్నాధ్ కి పవన్ కళ్యాణ్ దేవుడని ఆయనే కాదు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్క సినిమా కూడా చేయకుండా అప్పటికే స్టార్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఒక కొత్త దర్శకుడికి అది కూడా టీవి సీరియల్ ఎక్స్పీరియన్స్ తో సినిమా తీస్తాడంటే ఛాన్స్ ఎలా ఇస్తాడు. అసలు ఆ అలోచనకి ఆశకి హద్దుండాలి. పది సంవత్సరాలు ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో అనుభవం ఉంటే కూడా నాని, నాగ చైతన్య లాంటి కుర్ర హీరోలు దర్శకుడిగా అవకాశం ఇవ్వడం లేదు. అలాంటిది పూరి కి పవన్ ఛాన్సిచ్చాడంటే మరి దేవుడే కదా. 

 

పూరి కథ సిద్దం చేసుకొని పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ కోసం చాలా ప్రయత్నాలు చేశాడట. అయితే సాధ్యం కాకపోవడంతో టాలీవుడ్ లో ఒక సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ ద్వారా పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ సంపాదించుకున్నాడు. అయితే పూరికి ఇక్కడే పెద్ద ట్విస్ట్ పడింది. అదేంటంటే పవన్ అపాయింట్‌మెంట్ ఇచ్చింది తెల్లవారు జామున 4 గంటలకి అని. అది విన్న పూరి మైండ్ బ్లాకయిందట. షాకవుతూ ఇదేంటి పొద్దున 4 గంటలకా ..అని అడిగితే అవును మనోడు ఆ టైం లోనే కథ వింటాడు. నువ్వొచ్చేసెయ్ అంటూ సమాధానం చెప్పాడట పూరి స్నేహితుడు.

 

అనుకున్నట్టుగానే పూరి తరువాత రోజు ఉదయం 3 గంటలకి లేచి నడుచుకుంటూ పవన్ ముందు 4 గంటల కల్లా ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే రెడీగా కూర్చున్న పవన్ పూరి ని చూసి నీకు అరగంట మాత్రమే టైం ఇస్తా. ఈలోపు నచ్చకపోతే ఆ డోర్ ఓపెనే ఉంటుంది లేచి వెళ్ళిపోవాలి అన్నాడట. ఆ మాటకి అయోమయంలో పడ్డాట పూరి. ఎందుకంటే ఫస్ట్ ఛాన్స్ కాబట్టి స్క్రిప్ట్ మొత్తం చెప్పాలని డిసైడై వస్తే ఈనేంటి అరగంట అంటున్నాడు అనుకున్నాడట. రెండు నిముషాలు ఆలోచించి అలా కాదు నేను మాట్లాడుతూనే ఉంటా ...మీరు వినండి ఎక్కడైతే నచ్చలేదో అప్పుడు ఆ డోర్ వంక చూడండి నాకర్ధమవుతుంది అన్నాడట పూరి. 

ఆ తర్వాత పవన్ కి పూరి కథ చెప్పడం మొదలు పెట్టాడట ..అరగంట కాస్త గంట గంట కాస్తా నాలుగు గంటలు అయి పూరి చెప్పిన కథ పవన్ కి విపరీతంగా నచ్చి వెంటనే ప్రొడ్యూసర్ కి ఫోన్ చేసి పూరి గురించి చెప్పాడట. అలా పవన్ పూరికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే పూరి పవన్ కి చెప్పాలనుకుంది మాత్రం బద్రి కథ కాదు ..రవితేజ చేసిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం. కాని ఆ కథ పవన్ కి నచ్చదు అలాగే ఆయనకి సూట్ అవదని పవన్ తో సినిమాకోసం అబద్దం చెప్పి అపాయింట్‌మెంట్ సంపాదించాడు పూరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: