బుల్లితెర మీద అల్లరల్లరి చేసి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న యాంకర్ ప్రదీప్ కూడా హీరో అయిపోయాడు. గడసరి అత్తా సొగసరి కోడలు అంటూ బుల్లితెరపైకి వచ్చి అర్థంపర్థం లేకుండా మాట్లాడిన ప్రదీప్ కూడా హీరో అయిపోయాడు.. కొంచం టచ్ లో ఉంటె చెప్తా.. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అంటూ చేసుకుపోయే ప్రదీప్ మొన్న ఓ యాక్సిడెంట్ కారణంగా కొద్దీ రోజులు రెస్ట్ తీసుకున్నాడు. 

 

ఈ మధ్యే అదిరింది షో తో మళ్లీ ఫార్మ్ లోకి వచ్చాడు. అయితే అలా యాంకరింగ్ కి ఫార్మ్ లోకి వచ్చాడో లేదో ఇలా సినిమాలలోకి అడుగు పెట్టేశాడు.. ఇప్పటికే ఎన్నో సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన యాంకర్ ప్రదీప్ ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు. ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' అనే రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. 

 

అయితే ఇలా హీరోగా తన ప్రయోగం ఏదో తాను చేసుకుంటూ.. అదృష్టాన్ని ఇలా పరీక్షించుకుంటున్నాడో లేదో.. ఎవరో దర్శకుడు అతనిపై కేసు వేశారు.. రెండు రోజులు జైల్లో గడిపిన వ్యక్తి హీరోగా ఏలా చేస్తాడు.. సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్ రూల్స్ ప్రకారం హీరోగా నటించేందుకు ప్రదీప్ అనర్హుడు అంటూ నిన్న ఆదివారం కేసు వేశారు. అయితే ఆ కేసుపై స్పందించిన ప్రదీప్ ఫైర్ అయ్యాడు. 

 

అయితే ఈ విషయంపై ప్రదీప్ మాట్లాడుతూ.. నేను జైలు వేళ్ళ అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.. నేను గతంలో కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీస్ కౌన్సిలింగ్ కు మాత్రే వెళ్ళాను.. నాపై కావాలనే ఇలాంటి చెత్త ఆరోపణలు చేస్తున్నారు.. సునిషిత్ అనే దర్శకుడు పేరు నేను మొదటిసారి వింటున్న.. దయచేసి నిజానిజాలు తెలుసుకోండి తప్పుడు ప్రచారాలు చెయ్యద్దు అంటూ క్లారిటీ ఇచ్చాడు ప్రదీప్. అయితే ఇప్పటికి ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: