రోజుల్లో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్ అంటూ ఒక్కటేమిటి ఎక్కడ చూసినా లవ్ బర్డ్స్ దే హవా. అయితే వీరి మధ్యలో మేం సింగిల్ గాళ్ళం అంటూ ఒక బ్యాచ్ ఎప్పుడూ ఉండనే ఉంటుంది కదా. అలా ఒంటరిగా వచ్చే కుర్రాళ్ళ కోసం షాపింగ్ మాల్ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం పది రూపాయలకే గర్ల్ ఫ్రెండ్స్ ను అద్దెకు పంపించే ఒక ఒక వినూత్నమైన ఆలోచనను తెరమీదకు తెచ్చింది దీంతో షాపింగ్ మాల్ కు యువకుల యొక్క తాకిడి భారీగా పెరిగిపోయింది.

 

మన కరెన్సీ ప్రకారం రెండు నిమిషాలకు ఒక రూపాయి చొప్పున…. అనగా పది రూపాయలకు 20 నిమిషాలు సదరు గర్ల్ ఫ్రెండ్స్ అబ్బాయిలతో షాపింగ్ మాల్ మొత్తం తిరుగుతారు. ఒంటరిగా వచ్చే యువకుల యొక్క అవసరం గమనించిన షాపింగ్ మాల్ యాజమాన్యం అమ్మాయిలను ఒక పోడియం దగ్గర నిలబెట్టారు. 20 నిమిషాలకు పది రూపాయలు చెల్లిస్తే చాలు కస్టమర్లు పోడియం దగ్గర ఉన్న వారిలో ఎవరు నచ్చితే వారికి డబ్బులు చెల్లించి షాపింగ్ కు తోడుగా తీసుకొని వెళ్లొచ్చు. అయితే 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు మీరు ఎంత డబ్బులు చెల్లించినా వారు రారు. సమయం మించి పోయిన వెంటనే మళ్ళీ పొడియం దగ్గరకు వచ్చేస్తారు.

 

అయితే ఈ షాపింగ్ మాల్ వారు కేవలం యువకులకే కాకుండా యువతులకు కూడా అమ్మాయిలను షాపింగ్ కు తోడుగా తీసుకుని వెళ్లేందుకు వెసులుబాటు కలిపించారు. షాపింగ్ లో ఏదైనా అనుమానాలు వస్తే తీర్చడంబ్యాగ్స్ పట్టుకోవడం, పిల్లల్ని ఎత్తుకోవడం వంటి పనులు కూడా కొత్త తరం గర్ల్ ఫ్రెండ్స్ చేస్తుంటారు. కొసమెరుపు ఏంటంటే.. లంచ్, డేటింగ్ కోసం కూడా కస్టమర్లు గర్ల్‌ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లొచ్చు. అందుకోసం రెండు నిబంధనలు పెట్టారు. గర్ల్‌ఫ్రెండ్‌గా తీసుకెళ్లినవారిని ముట్టుకోకూడదు. షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణం దాటి ఎక్కడికీ తీసుకెళ్లకూడదు

మరింత సమాచారం తెలుసుకోండి: