వెన్నల కిషోర్.. ఎప్పుడు ఏదో ఒక తింగరి పని చేస్తూ ఉంటారు.. ఏంటి సినిమాల్లో అనుకుంటున్నారా? అంతలేదు.. మనోడు రియల్ లైఫ్ లో కూడా అంతే.. ఏదో ఒక తింగరి పని చేస్తాడు. అదేం అంటే.. సరదా అంటాడు. అవును నిజమే.. అందరితో సరదా సరదాగా గడుపుతుంటాడు.. వెన్నల కిషోర్.  

 

అప్పుడు ఎప్పుడో.. వరల్డ్ కప్ టైంలో బ్రహ్మాజీ తను సూపర్ ఓవర్ గురించి కామెడీగా మాట్లాడుకున్న సెల్ఫీ వీడియోను తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వెన్నల కిషోర్ ఆ తర్వాత చాలా కామెడీనే చేశాడు. అయితే ఆ రియల్ లైఫ్ కామెడీ వీడియో సోషల్ మీడియాలో ఏవి వైరల్ కాలేదు.. కానీ ఇప్పుడు తాగుబోతు రమేష్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

అంతగా తాగుబోతు రమేష్ ఏం చేశాడు అని అనుకుంటున్నారా? అదేనండి... తాగుబోతు రమేష్ ఓ చెరువు వద్దకు వెళ్తాడు.. అయితే అక్కడ దిగడానికి ప్రయత్నిస్తాడు.. ఆ సమయంలో వెన్నల కిషోర్.. రమేష్ ని అడుగుతాడు.. ''ఏంటి.. నువ్ బ్యాంకాక్ మిస్ అవుతున్నావా'' ?అని.. అతను అవును.. మిస్ అవుతున్నా.. అంటడు. 

 

ఎందుకో.. అంతలా మిస్ అవుతున్నావ్ బ్యాంకాక్ అంటే.. అక్కడ మసాజ్ సెంటర్లకు వెళ్తే మసాజ్ చేయించుకోవడం.. కాళ్లు చేపల తొట్టెలో పెడితే చేపలు వచ్చి కాళ్లను పట్టుకోవడం గొప్ప ఎక్స్‌పీరియన్స్‌‌ అని చెప్పి.. ఈ చెరువులో కూడా ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏమో చూడలి అంటూ నవ్వుతాడు.. అయితే అతను చెరువులో కాళ్ళు పెట్టగానే చేపలు వచ్చి అతన్ని పట్టేసుకుంటాయి. ఇదంతా కాస్త తీసిఇ సోషల్ మీడియాలో పెట్టేశాడు వెన్నల కిషోర్. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: